ఐపీఎల్ ట్రోఫీ నాకు ప్రపంచకప్‌తో సమానం: యువరాజ్ | IPL trophy will go along with my World Cup victories: Yuvraj Singh | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ ట్రోఫీ నాకు ప్రపంచకప్‌తో సమానం: యువరాజ్

Published Mon, May 30 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

ఐపీఎల్ ట్రోఫీ నాకు ప్రపంచకప్‌తో సమానం: యువరాజ్

ఐపీఎల్ ట్రోఫీ నాకు ప్రపంచకప్‌తో సమానం: యువరాజ్

తొమ్మిదో ప్రయత్నంలో ఐపీఎల్ ట్రోఫీ తన చేతుల్లోకి రావడం పట్ల సన్‌రైజర్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ అమితానందం వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లకు తన కోరిక తీరిందన్నాడు. గతంలో అండర్-19 ప్రపంచకప్‌తో పాటు వన్డే, టి20 వరల్డ్ కప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టులో ఉన్న యువరాజ్...ఐపీఎల్ టైటిల్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెప్పాడు.

‘నేను ప్రపంచకప్‌లు గెలిచినా ఐపీఎల్ ఒక్కసారి కూడా దక్కలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ఆ క్షణం వచ్చింది. ఇదో గొప్ప అనుభూతి. ఇప్పుడు నా దృష్టిలో ఇది ప్రపంచకప్‌లతో సమానమైన విజయం’ అని యువీ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement