ఆటో డ్రైవర్‌ కొడుకు ఐపీఎల్‌కు సెలక్ట్ అయ్యాడు | Mohammad Siraj Got Selected For IPL Sun Riser's | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 20 2017 7:43 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

మాసాబ్‌ట్యాంక్‌ సమీపంలోని ఖాజానగర్‌లో ఉన్న ఒక ఇరుకైన అద్దె ఇల్లు సోమవారం ఒక్కసారిగా జనసంద్రంతో నిండిపోయింది. లెక్క లేనంత సంఖ్యలో ఉన్న సిరాజ్‌ మిత్రులు, పాత బంధువులు, కొత్తగా పరిచయం చేసుకున్న మరికొందరితో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆటో డ్రైవర్‌ గౌస్‌ కొడుకైన సిరాజ్‌ కేవలం స్వయంకృషి, పట్టుదలతో సాధించిన పేరు అది. రాజకీయాలు, సిఫారసులకు అడ్డా అయిన హైదరాబాద్‌ క్రికెట్‌లో కేవలం ప్రతిభపైనే ఈ 22 ఏళ్ల పేసర్‌ దూసుకొచ్చాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో భారీ మొత్తంతో దేశం దృష్టినీ అతను ఆకర్షించాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement