సిడ్నీ: ఐపీఎల్-2021లో పాల్గొన్న ఆసీస్ క్రికెటర్లు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. భారత్‌లో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆసీస్ క్రికెటర్లు రెండు వారాలు పాటు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి ఓ ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం సిడ్నీ చేరుకున్నారు. 38 మంది ఆసీస్ ఆటగాళ్లు సహా కోచింగ్ స్టాఫ్ ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయ్యారు.
ప్రముఖ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్ వెల్, సిడ్నీ విమానశ్రాయానికి చేరుకున్నట్టు ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. విమానశ్రాయానికి చేరుకున్న ఆటగాళ్లు నేరుగా సిడ్నీలో ఓ హాటల్‌లో 14 రోజులు క్వారంటైన్లో ఉంటారని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా బారిన పడిన ఆసీస్ మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ మైక్ హస్సీ పూర్తిగా కోలుకోవడంతో స్వదేశాకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
(చదవండి:సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు)
Comments
Please login to add a commentAdd a comment