
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభంకానుండగా తమ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద షాకే తగిలింది. గతకొంతకాలంగా మోకాలి సమస్యతో బాధపడుతున్న స్టోక్స్.. ఐపీఎల్ 16వ ఎడిషన్‌ను కేవలం బ్యాటర్‌గానే ప్రారంభిస్తాడని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పష్టమైన ప్రకటన చేశాడు. లీగ్ సెకండాఫ్ సమయానికి స్టోక్స్ పూర్తిగా కోలుకుంటే బౌలర్‌గా సేవలందిస్తాడని హస్సీ పేర్కొన్నాడు.
కోట్లు కుమ్మరించి కొనుక్కున్న స్టోక్స్ ఆల్‌రౌండర్‌గా ఇరగదీస్తాడిన భావిస్తే, ఇలా జరిగిందేంటి అని సీఎస్‌కే యాజమాన్యం తలలుపట్టుకుంది. వాస్తవానికి స్టోక్స్ 2023 సీజన్ మొత్తానికే అందుబాటులో ఉండడని తొలుత ప్రచారం జరిగింది. అయితే స్టోక్స్‌కు కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి ఐపీఎల్ ప్రారంభ సమయానికంతా రెడీ చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ సరిగ్గా లేనప్పుడు, ఆదరాబాదరాగా అతన్ని ఎందుకు ఆడించాలని సీఎస్‌కే అభిమానులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఆల్‌రౌండర్‌గా పొడిచేస్తాడనే కాదా అతన్ని రూ. 16.25 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుందని నిలదీస్తున్నారు. అసలే గత సీజన్‌ను ఆఖరి నుంచి రెండో స్థానంతో ముగించినందుకు ఫీలవుతున్న తమిళ తంబిలకు స్టోక్స్ పంచాయితీ పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే, మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో సీఎస్‌కే తమ ఐపీఎల్-2023 జర్నీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఐకానిక్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
Comments
Please login to add a commentAdd a comment