PC: IPL.com
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయం కారణంగా పేసర్లు దీపక్ చహర్ సిసిందా మగాల సీఎస్‌కేకు రెండు వారాలు దూరం కాగా.. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఫిట్‌నెస్ కూడా జట్టు మేనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. స్టోక్స్ మరో వారం రోజుల పాటు జట్టుకు దూరంగా ఉండనున్నట్లు సీఎస్‌కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు.
"బెన్ స్టోక్స్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కాదు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగానే అతడికి విశ్రాంతిని ఇస్తున్నాం. అతడు మరో వారం రోజుల పాటు జట్టుకు దూరంగా ఉండనున్నాడు. అతడు తన ఫిట్‌నెస్‌ను సాధించడానికి కష్టపడుతున్నాడు. త్వరలోనే అతడు తిరిగి మైదానంలో అడుగుపెడతాడని ఆశిస్తున్నాను.
అదే విధంగా అతనికి కొంచెం అదృష్టం కలిసి రావలంటూ "ఫ్లెమింగ్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 మినీవేలంలో బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
స్టోక్స్‌కు 16 కోట్లు దండగ.. రహానే బెటర్
ఇక ఇది ఇలా ఉండగా.. స్టోక్స్ గాయం నుంచి కోలుకున్నా ఈ ఏడాది సీజన్‌లో మిగితా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేది అనుమానమే అని పలువురు మాజీ క్రికెటర్‌లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది జూలైలో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో యాషెస్ సిరీస్ సమయానికి ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఉన్న స్టోక్స్ పూర్తి ఫిట్‌నెస్‌గా ఉండాలని భావిస్తున్నాడట. ఒక వేళ అతడు గాయం నుంచి కోలుకున్నా, ఒకట్రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉంది.
యాషెస్ సిరీస్ సందర్భంగా అతడు మే నెల రెండో వారంలో తన స్వదేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్టోక్స్ ముందే తమ ప్రాంఛైజీకి తెలియజేసినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్ కోసం జూన్‌లో తమ ప్రాక్టీస్‌ను మొదలపెట్టనుంది. ఈ క్రమంలోనే అతడు స్వదేశానికి వెళ్లనున్నల్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక 16.25 కోట్లు తీసుకుని బెంచ్‌కే పరిమితమైన స్టోక్స్ కంటే కేవలం రూ.50 లక్షలు మాత్రమే తీసుకున్న అంజిక్యా రహానే ఎంతో బెటర్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రహానే ప్రస్తుతం అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రహానే 138 పరుగులు సాధించాడు.
చదవండి: #MS Dhoni: నాకూ కూతురు ఉంది.. మరి అక్క ఏది? తంబీ లేడా?.. తప్పు చేశావు కుట్టీ.. పాపం ధోని!
Ben Stokes will be fit by April 30th. Csk fans: pic.twitter.com/HCyzMrqaJb
— runmachinevirat (@runmachinevi143) April 13, 2023
IPL 2023: MS Dhoni is completely fine, Ben Stokes will be out for a week, says CSK coach Stephen Fleming https://t.co/cGYl81D9zS
— TOI Cricket (@TOICricket) April 22, 2023
Comments
Please login to add a commentAdd a comment