![Stokes Might Return Vs SRH After Allrounder Took Part In net Practice - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/21/ben.jpg.webp?itok=Sf9lgOaF)
PC: IPL.com
ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. చెపాక్ స్టేడియం వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సీఎస్‌కే తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు గుడ్‌న్యూస్ అందినట్లు సమాచారం. చేతి వేలి గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది.
అతడు నెట్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఎస్‌ఆర్‌హెచ్‌తో జరగబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది సీజన్‌లో స్టోక్స్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో తీవ్ర నిరాశపరిచాడు. రెండు మ్యాచ్‌లు కలిపి కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు.
కనీసం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనైనా స్టోక్స్ తన మార్క్ చూపించాలని సీఎస్‌కే అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్-2023 మినీవేలంలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. మూడింట విజయం సాధించి పాయిట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
సీఎస్‌కే తుది జట్టు(అంచనా)
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, ఆకాష్ సింగ్
చదవండి: IPL 2023: విధ్వంసకర వీరుడొచ్చాడు.. వెలగబెట్టిందేమీ లేదు! పాపం పంజాబ్..
IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్
Comments
Please login to add a commentAdd a comment