టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని బ్యాటింగ్ రహస్యాలను ఎవరికీ చెప్పనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ వెల్లడించాడు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనున్న నేపథ్యంలో హస్సీ వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. ఆసీస్‌తో సహా అన్ని జట్లు ధోని కోసం ఎన్ని వ్యూహాలు రచించినా అవన్నీ విఫలమవడం ఖాయమని పేర్కొన్నాడు. ఇక ప్రతీ మ్యాచ్‌లో ధోని పక్కా ప్రణాళికతో బ్యాటింగ్‌కు దిగడని.. పరిస్థితులను బట్టి తన ఆటతీరును మార్చుకుంటాడని వివరించాడు.
‘తన బలాలు, బలహీనతలు ఏంటో ధోనికి తెలుసు. ధోని బ్యాటింగ్‌లో చాలా తక్కువ బలహీనతలు ఉన్నాయి. వాటిని ఆసీస్‌తో సహా ఎవరికి చెప్పను. అయితే తన బ్యాటింగ్ బలహీనతలు ఏంటో అతడికి తెలుసు. ప్రతీ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో బ్యాటింగ్‌కు దిగడు. మ్యాచ్‌లో జట్టు అవసరాలు, పరిస్థితుల ప్రకారం తన ఆటతీరును మార్చుకుని భాద్యతతో ఆడతాడు. ఇక ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆసీస్ ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆసీస్‌పై అఫ్గానిస్తాన్ పోరాటం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది’అంటూ హస్సీ పేర్కొన్నాడు.
‘ధోని రహస్యాలను ఎవరికీ చెప్పను’
Published Fri, Jun 7 2019 8:01 PM | Last Updated on Fri, Jun 7 2019 8:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment