
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ ఎట్టకేలకు స్వదేశానికి బయలు దేరాడు. మాల్దీవుల నుంచి ఆదివారం దోహా మీదుగా హస్సీ ఆస్ట్రేలియాకు పయనమయ్యాడని, సోమవారం అక్కడికి చేరుకుంటాడని చెన్నై జట్టు సీఈవో కేఎస్ విశ్వనాథన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఇక మాల్దీవుల్లో ఉన్న ప్యాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ సహా ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లు బీసీసీఐ ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకోనున్నారు.
సిడ్నీలోని ఓ హోటల్‌లో క్వారంటైన్ పూర్తి చేసుకున్న అనంతరం వారు ఇళ్లకు వెళ్లే అవకాశం ఉంది. కాగా భారత్‌లో కరోనా మహమ్మారి ప్రకంపనల నేపథ్యంలో ఐపీఎల్-2021 నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
చదవండి: సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు
Comments
Please login to add a commentAdd a comment