అంతా అతని వల్లే జరిగిందన్న పూరన్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌పై హస్సీ ఏమన్నాడంటే..? | IPL 2022 CSK VS RCB Trending: 12th April Viral Videos Hussey Comments | Sakshi
Sakshi News home page

IPL Trending: అంతా లారా వల్లే జరిగిందన్న పూరన్‌.. ఆర్సీబీతో మ్యాచ్‌పై హస్సీ ఏమన్నాడంటే..?

Published Tue, Apr 12 2022 1:35 PM | Last Updated on Tue, Apr 12 2022 1:47 PM

IPL 2022 CSK VS RCB Trending: 12th April Viral Videos Hussey Comments - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా సోమవారం (ఏప్రిల్‌ 11) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి గుజరాత్‌ టైటాన్స్‌ను ఓటమిని పరిచయం చేసింది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ ద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ ఫ్రాంచైజీ.. అరంగేట్రంలోనే హ్యాట్రిక్‌ విజయాలు సాధించి దూసుకుపోతుండగా, సన్‌రైజర్స్‌ జీటి విజయాల పరంపరకు అడ్డుకట్ట వేసింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. భువీ (2/37), నటరాజన్‌ (2/34), మార్కో జన్సెన్‌ (1/27), ఉమ్రాన్‌ మాలిక్‌ (1/39) రాణించడంతో గుజరాత్ టైటాన్స్‌ను 162 పరుగులకే కట్టడి చేయగలిగింది. ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అభినవ్‌ శర్మ (42), కేన్‌ విలియమ్సన్‌ (57) శుభారంభాన్ని అందించగా, ఆఖర్లో పూరన్‌ (18 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్‌ (8 బంతుల్లో 12 నాటౌట్‌; ఫోర్‌) చెలరేగి ఎస్‌ఆర్‌హెచ్‌ను విజయతీరాలకు చేర్చారు. 


ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి సన్‌రైజర్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన పూరన్‌, మ్యాచ్‌ అనంతరం ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌, దిగ్గజ ఆటగాడు బ్రియాన్‌ లారాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ప్రస్థానంపై పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన జట్టు తిరిగి గాడిలో పడటానికి  బ్యాటింగ్‌ కోచ్‌ లారానే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. 


ఈ వీడియోతో పాటు ఇవాళ (ఏప్రిల్‌ 12) ఆర్సీబీతో జరుగబోయే మ్యాచ్‌పై సీఎస్‌కే బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ ఏమన్నాడో (ప్రివ్యూ) చూడొచ్చు. ఇందులో సీఎస్‌కే ఆటగాళ్ల ప్రాక్టీస్‌, ఇతరత్రా దృశ్యాలు ప్రధానంగా ఆకట్టుకోగా, జట్టు మాజీ సభ్యుడు డుప్లెసిస్‌ను సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఆప్యాయంగా కౌగిలించుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ మరో ఆసిక్తికర పోరు జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో సీఎస్‌కే, ఆర్సీబీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన ఆర్సీబీ మరో విజయం కోసం ఉరకలేస్తుండగా.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సీఎస్‌కే ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది.  
చదవండి: ఐపీఎల్‌ చరిత్రలో చెత్త బౌలింగ్‌ రికార్డును సమం చేసిన సన్‌రైజర్స్‌ బౌలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement