
ధోనికి బ్యాకప్‌గా పార్థీవ్ పటేల్
భారత కెప్టెన్ ధోని వెన్నునొప్పితో బాధపడుతున్నందున... పార్థీవ్ పటేల్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా బంగ్లాదేశ్ పంపుతున్నారు. సోమవారం ప్రాక్టీస్ సందర్భంగా ధోని అసౌకర్యంగా కనిపించాడు. దీంతో ముందు జాగ్రత్తగా పార్థీవ్‌ను ఆసియాకప్ జట్టులోకి బ్యాకప్‌గా తీసుకున్నారు. అయితే ధోనికి తీవ్ర గాయమేమీ లేదని, అతను తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉందని జట్టు వర్గాలు తెలిపాయి.