టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు పాండ్యా తీవ్రంగా శ్రమిస్తున్నాడన్న ఊహాగానాలు ఊపుందుకున్నాయి.
తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు హార్దిక్ ఫిట్‌గా లేడని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు.
హార్దిక్ పాండ్యా టెస్టుల్లో రీఎంట్రీ ఇస్తాడని నేను అనుకోవడం లేదు. బహుశ వైట్ బాల్ అందుబాటులో లేపోవడంతో అతడు ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేసి ఉంటాడు. నాలుగు రోజులు లేదా ఐదు రోజుల పాటు టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడి శరీరం సహకరించదు.
ఒకవేళ హార్దిక్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలంటే అంతకంటేముందు కనీసం ఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్ అయినా ఆడాలి. అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదని ఓ ఇంటర్వ్యూలో పార్ధివ్ పేర్కొన్నాడు.
హార్దిక్ పాండ్యా 2018లో తన చివరి టెస్ట్ మ్యాచ్ భారత్ తరపున ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాకే కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఫిట్‌నెస్ లేమి కారణంగా పాండ్యా కేవలం వైట్-బాల్ క్రికెట్‌పై మాత్రమే దృష్టి సారించాడు. గత ఆరేళ్లగా అతడిని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి.
మధ్యలో ఓసారి పాండ్యా వెన్నుముక సర్జరీ కూడా చేసుకున్నాడు. ఈ కారణాలతో అతడు రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు తిరిగి మళ్లీ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో భారత జట్టులోకి రానున్నాడు.
చదవండి: SA vs IRE: దక్షిణాఫ్రికా ఓపెనర్ విధ్వంసం.. చిత్తుగా ఓడిన ఐర్లాండ్
Comments
Please login to add a commentAdd a comment