
ఈ జట్టుతో ప్రపంచంలో ఎక్కడైనా గెలుస్తాం...
ప్రస్తుతం భారత జట్టు కూర్పు అద్భుతంగా ఉందని, ఈ జట్టుతో ప్రపంచంలో ఏ దేశంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా టి20ల్లో గెలుస్తామని కెప్టెన్ ధోని అన్నాడు. స్వదేశంలో ఏ జట్టయినా బలంగానే ఉంటుందని, ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై గెలవాలంటే తాము నాణ్యమైన క్రికెట్ ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతానికి జట్టులో ఎవరికీ ఎలాంటి గాయాలు లేకపోవడం వల్ల ప్రపంచకప్‌కు బాగా సన్నద్ధమైనట్లేనని ధోని అన్నాడు.