ధోని కొత్త బ్రాండ్! | Dhoni new brand | Sakshi
Sakshi News home page

ధోని కొత్త బ్రాండ్!

Published Sat, Feb 20 2016 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

ధోని కొత్త బ్రాండ్!

ధోని కొత్త బ్రాండ్!

‘7’ షూస్ పేరుతో మార్కెట్‌లోకి
న్యూఢిల్లీ: ఇందుగలడందు లేడంటూ వేర్వేరు వ్యాపారాల్లో భాగస్వామిగా కనిపిస్తున్న భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ఎమ్మెస్ ధోని ఇప్పుడు లైఫ్ స్టయిల్ మార్కెట్‌లోకి కూడా అడుగు పెట్టాడు.  ప్రత్యేకంగా క్రీడాకారుల కోసం డిజైన్ చేసిన దుస్తులు, షూస్‌లను ‘7’ పేరుతో అతను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాడు. రితి స్పోర్ట్స్ సంస్థ ఆర్‌ఎస్ సెవెన్ లైఫ్‌స్టయిల్ పేరుతో వీటిని తీసుకొచ్చింది. ‘7’కు అంతర్జాతీయ ప్రచారకర్తగా ధోని వ్యవహరిస్తున్నట్లు శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. అయితే రితి స్పోర్ట్స్‌లో ధోని భాగస్వామి అనే సంగతి తెలిసిందే.

‘నా సొంత ఫుట్‌వేర్ బ్రాండ్ మార్కెట్‌లో ఉండాలనేది చాలా కాలంగా నా కోరిక. నాకు ఇష్టమైన 7 అంకెతో ఇది రావడం సంతోషకరం. దీని డిజైన్‌ను రూపొందించడంలో, మార్పుచేర్పులలో నేను కూడా భాగం అయ్యాను’ అని ధోని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచన తనకు లేదని ధోని చూచాయగా చెప్పాడు. ‘ఆసియా, వరల్డ్ కప్‌ల తర్వాత ఐపీఎల్ ఉంది. ఆ తర్వాత భారత్ ఎక్కువగా టెస్టులు ఆడినా కనీసం 5-6 వన్డేలు ఆడుతుంది. చాలా వేగంగా సమయం గడిచిపోతుంది. నేను సిద్ధంగా ఉన్నా’ అని ధోని వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement