
ప్రయర్ అవుట్...
లండన్: లార్డ్స్ ఓటమి ఇంగ్లండ్ జట్టుపై ప్రభావం చూపించడం మొదలైనట్లుంది. ఓటమి తర్వాత నిర్వేదంలోకి జారిపోయే చాలా మంది ఇంగ్లండ్ క్రికెటర్లలాగే ఇప్పుడు వికెట్ కీపర్ మాట్ ప్రయర్ కూడా వ్యవహరించాడు. ‘గాయం కారణంగా’ సిరీస్‌నుంచి తప్పుకుంటున్నట్లు అతను ప్రకటించాడు.
ఫలితంగా మిగిలిన మూడు టెస్టులకూ దూరమయ్యాడు. ‘చేతికి తగిలిన దెబ్బతో పాటు ఇతర గాయాలు సిరీస్‌కు ముందునుంచే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇది కఠిన నిర్ణయమని తెలుసు. అయితే పూర్తి ఫిట్‌నెస్‌తో తర్వాతి సీజన్‌కు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఒక ఆటగాడిగా జట్టుకు న్యాయం చేయలేకపోతున్న నేను ఆఖరి టెస్టు కూడా ఆడేశానేమో’ అని ప్రయర్ వ్యాఖ్యానించాడు.