
ఐపీఎల్-2022లో కొత్త జట్టుగా అవతరించిన లక్నో ఫ్రాంచైజీ.. హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌ను నియమించింది. ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఈ విషయాన్ని దృవీకరించారు. సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ.. ‘ఆండీ ఆటగాడిగా, కోచ్‌గా క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మేము అతని వృత్తి పట్ల పట్టుదలని గౌరవిస్తాము. మా జట్టును విజయ పథంలో నడిపిస్తాడాని నేను భావిస్తున్నాను అని అతను పేర్కొన్నాడు. ఇక ఫ్లవర్ మాట్లాడుతూ.. "లక్నో ఫ్రాంచైజీలో చేరినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఈ అవకాశం నాకు ఇచ్చినందకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 1993లో నేను తొలిసారిగా భారత పర్యటనకు వచ్చాను.
అప్పటినుంచి నేను ఎల్లప్పుడూ భారత్‌లో పర్యటించడం, ఆడడం, ఇక్కడ కోచింగ్‌ని ఇష్టపడతాను. భారత్‌లో క్రికెట్ పట్ల ఉన్న మక్కువ అసమానమైనది. నేను గోయెంకా, జట్టుతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఆండీ ఫ్లవర్ గత రెండు సీజన్లో పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. మరో వైపు రిపోర్ట్స్ ప్రకారం పంజాబ్ కింగ్స్ వదిలేసిన కేఎల్ రాహుల్ లక్నో ఫ్రాంచైజీకి కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక లక్నో ఫ్రాంచైజీని సంజీవ్ గోయెంకా గ్రూప్ 7090 కోట్లకు దక్కించుకుంది.
చదవండి: Rohit Sharma: బెంగళూరులో హిట్‌మ్యాన్.. వన్డే సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధించేనా?