టీమిండియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం తమ జట్టు బ్యాక్‌రూమ్ కన్సల్టెంట్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌ను నియమించిది. ఇంగ్లండ్ పరిస్థితుల్లో కోచ్‌గా ఫ్లవర్‌కు అపారమైన అనుభవం ఉండడంతో.. సీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా 2009 నుంచి 2014 వరకు ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఫ్లవర్ పనిచేశాడు. అంతకుముందు ఇంగ్లీష్ జట్టుకు డైరక్టర్‌గా పనిచేశాడు. అతడు హెడ్‌కోచ్‌గా ఉన్నప్పడు ఇంగ్లండ్ జట్టు మూడు సార్లు యాషెస్ విజేతగా నిలిచింది. అదే విధంగా ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఫ్లవర్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్‌లో కూడా ఆసీస్ జట్టుకు ఫ్లవర్ బ్యాక్‌రూమ్ కన్సల్టెంట్‌గా ఉండే అవకాశం ఉంది. కాగా జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
సబ్‌స్టిట్యూట్స్: సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, ముఖేష్ కుమార్.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్షాన్ , టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, మాథ్యూ రెన్షా.
Comments
Please login to add a commentAdd a comment