లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో టీమిండియా వెటరన్ పేసర్ రవిచంద్రనన్ అశ్విన్‌కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ సైకిల్ 2021-23 సైకిల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌ను పక్కన పెట్టడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇదే విషయంపై ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది.
అశ్విన్ జట్టులో ఉంటే టీమిండియా గెలిచి ఉండేదాని చాలా మంది మాజీ క్రికెటర్‌లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో అశ్విన్ ఓ షాకింగ్ విషయం వెల్లడించాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించినట్లు ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ తెలిపాడు.
కాగా అశ్విన్ తన మోకాలి గాయం కారణంగానే రిటైర్మెంట్ గురించి ఆలోచించాడు. అశ్విన్ చాలా కాలం నుంచి మోకాలి నొప్పితో బాధపడుతూనే ఉన్నాడు. దీని వల్ల అతని కెరీర్ కూడా చాలా దెబ్బతింది. "బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత భారత్‌కు వచ్చాక తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడ్డాను. ఇదే విషయంపై నా భార్యతో కూడా మాట్లాడాను. ఆస్ట్రేలియా సిరీస్ నాకు చివరిదయ్యే అవకాశం ఉందని తనకు చెప్పేశాను. గాయం కారణంగా నా బౌలింగ్ యాక్షన్ మార్చుకోవాలి అనుకుంటున్నట్లు కూడా తనకు చెప్పా.
బౌలింగ్ వేసే క్రమంలో నా మోకాలిపై చాలా ప్రభావం పడేది. దీంతో చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో నొప్పి మరి ఎక్కువైంది. అనంతరం బెంగుళూరు వచ్చి నొప్పికి ఇంజెక్షన్ తీసుకున్నాను. ఆ తర్వాత నా బౌలింగ్ యాక్షన్ మార్చుకోవడానికి చాలా కష్టపడ్డా. దాదాపు రోజుకు 3-4 గంటలు కొత్త బౌలింగ్ యాక్షన్ ప్రాక్టీస్ చేశా అని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ చెప్పుకొచ్చాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు.. ఒకే ఓవర్‌లో 6 వికెట్లు
Comments
Please login to add a commentAdd a comment