ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి పాలైన భారత జట్టుపై వెస్టిండీస్ లెజెండ్ సర్ ఆండీ రాబర్ట్స్ ఘూటు వాఖ్యలు చేశాడు. అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే భారత జట్టు ఓడిపోయిందని అతడు విమర్శించాడు. కాగా లండన్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 209 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో భారత జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ జాబితాలో ఆండీ రాబర్ట్స్ కూడా చేరాడు.
"భారత క్రికెట్‌కు అహంకారం ఎక్కవైంది. అందువల్ల ప్రపంచక్రికెట్‌లో మిగితా జట్లను తక్కువగా అంచనా వేస్తున్నారు. ఏదో ఒక్క కుప్పకూలిపోతారు అని నాకు తెలుసు. అందుకే భారత జట్టుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. టెస్ట్ క్రికెట్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమ లోపాలపై దృష్టి పెట్టాలి. తమ తీరును మార్చుకుని ముందుకు వెళ్లాలి. టీ20 క్రికెట్‌ను నేను పెద్దగా లెక్కలోని తీసుకోను. అందులో బ్యాట్ కు, బంతికి మధ్య సరైన పోటీనే లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ తమ బ్యాటింగ్ బలాన్ని ప్రదర్శిస్తుందని నేను ఊహించాను.
అజింక్య రహానే పోరాటం మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. రహానే తన చేతికి గాయమైనప్పటికీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. శుబ్‌మన్ గిల్ కొన్ని షాట్లు మంచిగా ఆడాడు. కానీ అతడు లెగ్ స్టంప్‌పై నిలుచుని తన వికెట్‌ను కోల్పోయాడు. విరాట్ కోహ్లి కూడా అంతే. మిచెల్ స్టార్క్ వేసిన బంతికి కోహ్లి దగ్గర సమాధానమే లేకపోయింది.
భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ విదేశాల్లో మాత్రం రాణించలేకపోతున్నారు" అని మిడ్‌డే ఫ్రమ్ ఆంటిగ్వాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్స్ పేర్కొన్నాడు. కాగా వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
చదవండి: Ashes 2023: సరికొత్త వార్నర్‌ను చూస్తాం.. అతడికి చుక్కలు చూపిస్తాడు: ఆసీస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment