తల్లితో ప్యాట్ కమిన్స్ (ఫైల్ ఫొటో)
England vs Australia, 1st Test: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. 2019లో తన తండ్రి.. తల్లితో పాటు మ్యాచ్ చూడటానికి వచ్చారని.. ఇప్పుడు లండన్‌లో ఆయన ఒక్కరే ఉన్నారని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్న సమయంలో ప్యాట్ కమిన్స్ ఉన్నఫళంగా ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే.
బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి బాగోగులు చూసుకునేందుకు టెస్టు సిరీస్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే కమిన్స్ తల్లి కన్నుమూసింది. అయితే, తాను ఎంతగానో ప్రేమించే మాతృమూర్తిని కోల్పోయిన బాధ నుంచి కమిన్స్ ఇంకా బయటపడలేకపోతున్నాడు.
ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ తర్వాత ఆసీస్ నేరుగా టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడింది. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కమిన్స్.. మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక కమిన్స్ సారథ్యంలోని ఆసీస్.. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో 209 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేనను ఓడించింది.
తద్వారా సంప్రదాయ క్రికెట్‌లోనూ విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఈ మ్యాచ్ ముగియగానే ఆసీస్.. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 16-20 వరకు జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో కమిన్స్ 4 వికెట్లు తీయడంతో పాటు.. కీలక సమయంలో 44 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం కమిన్స్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగతంగా.. గత కొన్నిరోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా.
అయితే, ఈ వారం మొత్తం నాన్న, నా సోదరుడు నాతో పాటే ఉన్నారు. 2019లో నాన్న అమ్మతో పాటు వచ్చారు. కానీ ఇప్పుడు ఇలా!.. మరేం పర్లేదు ఆయన నాతో ఉండటం స్పెషల్.. లక్కీగా ఫీలవుతున్నా’’ అని ఎమోషనల్ అయ్యాడు.
చదవండి: Ravindra Jadeja: పాపం! జడేజా మనసు గాయపడి ఉంటుంది.. సీఎస్‌కే సీఈఓ కామెంట్స్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment