విరాట్ కోహ్లి (ఫైల్ ఫొటో- PC: BCCI/IPL)
IPL 2024- RCB- బెంగళూరు: ఐపీఎల్ తాజా ఎడిషన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ గురువారం ప్రీ సీజన్ క్యాంప్(శిక్షణా శిబిరం)నకు శ్రీకారం చుట్టింది. అయితే జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కాస్త ఆలస్యంగా శిబిరంలో చేరనున్నాడు. ఫ్రాంచైజీల వ్యవహారాల్ని పరిశీలిస్తున్న బీసీసీఐ ఇందుకు గల కారణాన్ని వెల్లడించింది.
వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి త్వరలోనే జట్టుతో కలుస్తాడని తెలిపింది. కాగా.. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో కోహ్లి లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన అతడు.. ‘ఆర్సీబీ అన్‌బాక్స్’ ఈవెంట్ సందర్భంగా తిరిగి అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
కెప్టెన్ వచ్చేశాడు..
ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు వెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ప్రీ సీజన్ క్యాంపులో చేరారు. ఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కొత్త హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, క్రికెట్ డైరెక్టర్ మో బొబట్‌లు జట్టుతో చేరి శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నారు.
సంతోషంగా ఉంది
ఈ నేపథ్యంలో కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘ఆండీ ఫ్లవర్ అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి కోచ్ మార్గదర్శనంలో ముందుకు సాగడం మా జట్టు చేసుకున్న అదృష్టం. గొప్ప మనసున్న వ్యక్తి’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు.
మరోవైపు ఆండీ ఫ్లవర్ సైతం ఆర్సీబీ చరిత్రలోని ఓ నూతన అధ్యాయంలో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో సీజన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ జరుగనుంది.
చదవండి: IPL 2024: షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య! వైజాగ్‌లోనూ
Comments
Please login to add a commentAdd a comment