వచ్చే ఐపీఎల్ సీజన్ (2024) కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ జట్టు.. తమ హెడ్ కోచ్‌ను మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న ఆండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ 2023 సీజన్‌తోనే ముగియడంతో ఆ జట్టు కొత్త కోచ్ అన్వేషణలో పడింది.
ఈ పదవి కోసం ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్ ఆసీస్ మాజీ హెడ్ కోచ్, ఆ జట్టు మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై లాంగర్ కాని, ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం కాని ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇరు వర్గాల మధ్య మంతనాలు జరుగుతున్నట్లు క్రికెట్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది.
ఒకవేళ ఇదే నిజమైతే వచ్చే సీజన్ నుంచి ఎల్‌ఎస్‌జీ హెడ్ కోచ్‌గా లాంగర్ వ్యవహరించే అవకాశం ఉంది. 52 ఏళ్ల జస్టిన్ లాంగర్.. ఆసీస్‌ను 2021 టీ20 వరల్డ్‌కప్ విజేతగా, బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌ను మూడుసార్లు ఛాంపియన్‌గా (కోచ్‌గా) నిలబెట్టాడు.
ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్‌ఎస్‌జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. వ్యాపార దిగ్గజం సంజీవ్ గోయెంకా కొనుగోలు చేసిన ఎల్‌ఎస్‌జీ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా, మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా, విజయ్ దాహియా అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment