ఐపీఎల్‌ ఒలింపిక్స్‌తో సమానం.. చాలా సంతోషంగా ఉంది: లక్నో హెడ్‌ కోచ్‌ | IPL is like Olympics, every game is a spectacle: Justin Langer | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఒలింపిక్స్‌తో సమానం.. చాలా సంతోషంగా ఉంది: లక్నో హెడ్‌ కోచ్‌

Published Sun, Dec 31 2023 10:52 AM | Last Updated on Sun, Dec 31 2023 10:53 AM

IPL is like Olympics, every game is a spectacle: Justin Langer  - Sakshi

ఐపీఎల్‌పై ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్‌ ఒలిపింక్స్‌తో సమానమని లాంగర్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు  లక్నో సూపర్‌ జెయింట్స్ తమ ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ఆండీ ప్లవర్‌ స్ధానాన్ని లంగర్‌తో లక్నో ఫ్రాంచైజీ భర్తీ చేసింది.

ఐపీఎల్‌లో హెడ్‌కోచ్‌ పదివి చేపట్టడం లంగర్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. లంగర్‌కు కోచ్‌గా అద్బుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది. అతడి నేతృత్వంలోనే ఆసీస్‌ తొలి టీ20 వరల్డ్‌కప్‌(2021)ను సొంతం చేసుకుంది. అదే విధంగా బిగ్‌బాష్‌ లీగ్‌లో కూడా లంగర్‌ కోచ్‌గా విజయవంతమయ్యాడు.

ఈనేపథ్యంలో లక్నో ఫ్రాంచైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లంగర్‌ మాట్లాడుతూ.. "రికీ పాటింగ్‌కు ఐపీఎల్‌ టోర్నీ అంటే చాలా ఇష్టం. అతడితో నేను ఎప్పుడు మాట్లాడిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన ప్రయాణం గురించే చెబుతూ ఉంటాడు. అదే విధంగా నా బెస్ట్‌ ఫ్రెండ్‌ టామ్ మూడీ సైతం ఐపీఎల్‌లో చాలా కాలంగా తన సేవలు అందిస్తున్నాడు. అతడు కూడా చాలా సార్లు ఈ టోర్నీ కోసం నాతో మాట్లాడాడు.

ఐపీఎల్‌ అనేది ఒలింపిక్స్‌ క్రీడలు వంటిది. ఇది చాలా పెద్ద ఈవెంట్‌. ప్రతీ మ్యాచ్‌ ఒక అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు ఆదరణ ఉంది. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు స్టేడియాలు దద్దరిల్లిపోతాయి. ఇటువంటి లీగ్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉం‍దని పేర్కొన్నాడు.
చదవండి: PAK vs AUS: పాకిస్తాన్‌తో మూడో టెస్టు.. ఆసీస్‌ జట్టు ప్రకటన! వార్నర్‌కు ఆఖరి మ్యాచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement