క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 18వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. 1997లో ఈ రోజు మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో మూడు అన్నదమ్ములు జోడీలు ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహించాయి. నాడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే తరఫున ఫ్లవర్ సోదరులు (ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్), స్ట్రాంగ్ సోదరులు (పాల్ స్ట్రాంగ్, బ్రియాన్ స్ట్రాంగ్), రెన్నీ సోదరులు (జాన్ రెన్నీ, గావిన్ రెన్నీ) తుది జట్టులో ఆడారు.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జింబాబ్వే జట్టులో 12వ నంబర్ ఆటగాడు ఆండీ విట్టల్.. జింబాబ్వే ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉన్న గయ్ విట్టల్‌కు సోదరుడు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఆండీ విట్టల్ కూడా ఆడి ఉంటే నాలుగు బ్రదర్స్ జోడీలు బరిలో ఉండేవి.
క్రికెట్ చరిత్రలో మూడు అన్నదమ్ముల జోడీలు ఒకే జట్టు తరఫున ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగడం అదే మొదటిసారి, చివరిసారి. క్రికెట్‌లో అన్నదమ్ములు జోడీలు చాలానే ఉన్నప్పటికీ.. ఒకే జట్టు తరఫున ఒకే మ్యాచ్‌లో మూడు జోడీలు బరిలోకి దిగింది లేదు.
ఒకే మ్యాచ్‌లో ఒకే జట్టు తరఫున బరిలోకి దిగిన అన్నదమ్ముల జోడీలు..
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా (భారత్)
షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)
టామ్ కర్రన్, సామ్ కర్రన్ (ఇంగ్లండ్)
ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ (భారత్)
స్టీవ్ వా, మార్క్ వా (ఆస్ట్రేలియా)
ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్ (జింబాబ్వే)
గై విట్టల్, ఆండీ విట్టల్ (జింబాబ్వే)
పాల్ స్ట్రాంగ్, బ్రియాన్ స్ట్రాంగ్ (జింబాబ్వే)
అల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్ (సౌతాఫ్రికా)
బ్రెండన్ మెక్‌కల్లమ్, నాథన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్)
మైక్ హస్సీ, డేవిడ్ హస్సీ (ఆస్ట్రేలియా)
కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్ (పాకిస్తాన్)
బ్రెట్ లీ, షేన్ లీ (ఆస్ట్రేలియా)
గ్రెగ్ ఛాపెల్, ఇయాన్ ఛాపెల్, ట్రెవర్ ఛాపెల్ (ఆస్ట్రేలియా)
జెస్సీ రైట్, ఫ్రాంక్ రైట్, రిచర్డ్ రైట్ (న్యూజిలాండ్)
చదవండి: ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న చహల్.. తాజాగా మరో మ్యాచ్‌లో..!
Comments
Please login to add a commentAdd a comment