కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి జింబాబ్వే స్టార్‌ బౌలర్‌! | IPL 2022P: Blessing Muzarabani can replace Mark Wood in LSG squad Says Reports | Sakshi
Sakshi News home page

IPL 2022: కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి జింబాబ్వే స్టార్‌ బౌలర్‌!

Published Fri, Mar 18 2022 8:21 PM | Last Updated on Wed, Mar 23 2022 6:29 PM

IPL 2022P: Blessing Muzarabani can replace Mark Wood in LSG squad Says Reports - Sakshi

ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ గాయం కారణంగా ఐపీఎల్‌-2022కు దూరం కానున్నాడు. దీంతో ఐపీఎల్‌ మెగా వేలం-2022లో 7.50 కోట్లు వెచ్చించి మార్క్‌ వుడ్‌ను దక్కించకున్న లక్నో సూపర్‌జెయింట్స్‌కు భారీ షాక్  భారీ షాక్ త‌గిలిన‌ట్లయింది. ఈ క్రమంలో అతడి స్ధానంలో జింబాబ్వే ఫాస్ట్‌ బౌలర్‌ బ్లెస్సింగ్ ముజారబానీను భర్తీ చేయాలని లక్నో ఫ్రాంఛైజీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. కాగా రూ. 50 లక్షల బేస్ ప్రైస్‌తో మెగా వేలంలో వచ్చిన ముజారబానీను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు.

ఈ జింబాబ్వే ఫాస్ట్‌ బౌలర్‌ గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. అంతే కాకుండా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో మూల్తాన్‌ సుల్తాన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా ఇప్పటి వరకు 21 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన 25 వికెట్లు పడగొట్టాడు. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 ప్రారంభం కానుంది. అదే విధంగా లక్నో సూపర్‌జెయింట్స్‌ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 28న గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 ప్రారంభం కానుంది. అదే విధంగా లక్నో సూపర్‌జెయింట్స్‌ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 28న గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది.

లక్నోసూపర్‌జెయింట్స్‌ జట్టు: క్వింటన్ డి కాక్, మనీష్ పాండే, జాసన్ హోల్డర్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, అవేష్ ఖాన్, అంకిత్ రాజ్‌పూత్, కె గౌతమ్, దుష్మంత చమీరా, షాబాజ్ నదీమ్, మనన్ వోహ్రా, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ మేయర్స్, కె. , కరణ్ శర్మ, ఎవిన్ లూయిస్, మయాంక్ యాదవ్

చదవండి: IPL 2022: కేఎల్‌ రాహుల్‌ జట్టుకు గుడ్‌ న్యూస్‌.. అతడు వచ్చేస్తున్నాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement