Ashes 2021: Mark Wood Terrifying Brutal Beamer Floordown Travis Head - Sakshi
Sakshi News home page

Ashes Test Series: మార్క్‌వుడ్‌ బీమర్‌.. బ్యాట్స్‌మన్‌ దవడ పగలింది

Published Fri, Dec 10 2021 12:50 PM | Last Updated on Fri, Dec 10 2021 3:12 PM

Ashes 2021: Mark Wood Terrifying Brutal Beamer Floordown Travis Head - Sakshi

Mark Wood Beamer Floordown Travis Head.. యాషెస్‌ సిరీస్‌లో​ భాగంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 81వ ఓవర్లో ఇంగ్లండ్‌ బౌలర్‌ మార్క్‌వుడ్‌ వేసిన బీమర్‌ దెబ్బకు ట్రెవిస్‌ హెడ్‌ నొప్పితో విలవిల్లాలాడాడు. వుడ్‌ చేతి నుంచి జారిన బంతి బౌన్స్‌ అవకుండా నేరుగా హెడ్‌ భుజం ఎత్తులో వచ్చింది. దీనిని డిఫెన్స్‌ చేసే క్రమంలో హెడ్‌ బ్యాట్‌ అడ్డుపెట్టినప్పటికి.. 136 కిమీవేగంతో వచ్చిన బంతి గోవ్స్‌, బ్యాట్‌ను తాకుతూ దవడ కింద బాగాన్ని అదిమింది. దీంతో హెడ్‌ ఉన్నచోటనే క్రీజులో కిందపడి కాసేపు నొప్పితో బాధపడ్డాడు.

చదవండి: Aus Vs Eng Ahses 1st Test: ట్రావిస్‌ హెడ్‌ సుడిగాలి సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆసీస్‌

ఇక ఇంగ్లండ్‌ బౌలర్‌ మార్క్‌వుడ్‌ ట్రెవిస్‌ హెడ్‌ను క్షమాపణ కోరగా.. ఫిజియో వచ్చి అతన్ని పరీక్షించాడు. ఈ క్రమంలో డగౌట్‌లో కూర్చున్న ఆసీస్‌ ఆటగాళ్లు కాస్త ఆందోళనకు గురవ్వడం వీడియోలో కనిపించింది. ఇక ఈ మ్యాచ్‌లో ట్రెవిస్‌ హెడ్‌ భారీ సెంచరీతో(152 పరుగులు)  ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగుల భారీ స్కోరు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 278 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఇక శతకంతో మెరిసిన ట్రెవిస్‌ హెడ్‌ గబ్బా మైదానంలో అత్యంత వేగంగా సెంచరీ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు 2015లో జో బర్న్స్‌ పేరిట ఈ రికార్డు ఉంది. ఇక ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలబడింది. ప్రస్తుతం 65 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్లు రోరీ బర్న్స్‌(13), హసీబ్‌ హమీద్‌(27)లు తక్కువ స్కోరు చేసినప్పటికి డేవిడ్‌ మలాన్‌(72*), కెప్టెన్‌ జో రూట్‌(82*) నిలదొక్కుకున్నారు. ఇంగ్లండ్‌ ఇంకా 70 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో​ 147 పరుగులకే కుప్పకూలింది. 

చదవండి: Ashes Series: డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్‌ అదుర్స్‌.. 127 ఏళ్ల తర్వాత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement