3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు సిరీస్ ప్రారంభానికి ముందే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయం కారణంగా తొలి టెస్ట్‌కు దూరమాయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అధికారికంగా ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2022 సందర్భంగా తుంటి గాయం బారిన పడిన వుడ్.. ఇంకా కోలుకోలేదని, రెండో టెస్ట్‌లోగా అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని మెక్‌కల్లమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా, పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్లు మధ్య తొలి టెస్ట్ రావల్పిండి వేదికగా డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 9 నుంచి రెండో టెస్ట్ (ముల్తాన్), 17 నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ (కరాచీ) జరుగనుంది.
ఇంగ్లండ్ జట్టు..
హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ క్రాలే, జో రూట్, కీటన్ జెన్నింగ్స్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ ఓవర్టన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, బెన్ ఫోక్స్, ఓలీ పోప్, జేమ్స్ ఆండర్సన్, ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్, మార్క్ వుడ్
పాకిస్తాన్ జట్టు..
బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అజార్ అలీ, షాన్ మసూద్, ఇమామ్ ఉల్ హాక్, అఘా సల్మాన్, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్, మహ్మద్ నవాజ్, నౌమాన్ అలీ, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, అబ్రర్ అహ్మద్, నసీం షా, మహ్మద్ అలీ, జహీద్ మహమూద్, హరీస్ రౌఫ్
Comments
Please login to add a commentAdd a comment