
చెన్నై:ఒక జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంయమనం ఎలా పాటించాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని చూసి నేర్చుకుంటానని అంటున్నాడు ఈసారి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ పేస్ బౌలర్ మార్క్ వుడ్. ఐపీఎల్‌లో తన కెప్టెన్ ధోని నుంచి ఎంతో నేర్చుకుంటానన్న వుడ్.. ప్రధానంగా ఒత్తిడిలోనూ సంయమనం కోల్పోకుండా ఉండటం మెలాగో అతని చూసి నేర్చుకోవాలన్నాడు.
ఇక నెమ్మదైన బంతులు వేసి బ్యాట్స్‌మెన్‌ను ఎలా ఇబ్బంది పెట్టాలో విండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవోనుంచి నేర్చుకుంటానన్నాడు. ఐపీఎల్‌లాంటి టోర్నీలో ఆడటం ఒక సరికొత్త అనుభవం అయితే, చెన్నైవంటి మేటి జట్టుకు ఆడడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నాడు. తమ జట్టుకు విజయాలు చేకూర్చడంలో తనవంతు పాత్ర పోషించడానికి శాయశక్తులా కృషి చేస్తానని వుడ్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment