#Dhruv Jurel: ‘తోపు బౌలర్‌ అయితే.. నాకేంటి?’.. వీడియో | Ind vs Eng 3rd Test: Dhruv Jurel Arrival Hitting Wood 146 kmph Bouncer for Six | Sakshi
Sakshi News home page

#Dhruv Jurel: 146 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బౌన్సర్‌.. కొడితే సిక్సరే! వీడియో

Published Fri, Feb 16 2024 1:46 PM | Last Updated on Fri, Feb 16 2024 3:09 PM

Ind vs Eng 3rd Test: Dhruv Jurel Arrival Hitting Wood 146 kmph Bouncer for Six - Sakshi

146 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బౌన్సర్‌.(PC: BCCI/sports18)

India vs England, 3rd Test- #Dhruv Jurel: రాజ్‌కోట్‌ టెస్టులో టీమిండియా అరంగేట్ర ఆటగాడు ధ్రువ్‌ జురెల్‌ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌గా భారత తుదిజట్టులో స్థానం సంపాదించిన అతడు.. ఎనిమిదో స్థానంలో ఆడాడు.

రెండోరోజు ఆటలో భాగంగా శుక్రవారం కుల్దీప్‌ యాదవ్‌ అవుటైన తర్వాత.. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు జురెల్‌. వెంటనే రవీంద్ర జడేజా(112) వికెట్‌ కూడా పడటంతో రవిచంద్రన్‌ అశ్విన్‌ క్రీజులోకి రాగా అతడితో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు.

సింగిల్‌తో ఖాతా తెరిచి.. సిక్సర్‌తో సత్తా చాటి
ఈ క్రమంలో కాస్త డిఫెన్సివ్‌గా ఆడిన ధ్రువ్‌ జురెల్‌.. తాను ఎదుర్కొన్న పదకొండో బంతికి పరుగుల ఖాతా తెరిచాడు. తొలుత రెండు సింగిల్స్‌ తీసిన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌.. ఆ తర్వాత ఆడిన షాట్‌ తొలి సెషన్‌కే హైలైట్‌గా నిలిచింది.

ఇంగ్లండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ మార్క్‌ వుడ్‌ గంటకు 146 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని.. ధ్రువ్‌ జురెల్‌ అద్భుత రీతిలో సిక్సర్‌గా మలిచాడు. ఆఫ్‌ స్టంప్‌నకు ఆవల పడిన బంతిని ర్యాంప్‌ షాట్‌తో స్టాండ్స్‌కు తరలించాడు.

తోపు బౌలర్‌ అయితే నాకేంటి?
ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. బౌన్సర్లు వేయడంలో దిట్ట అయిన మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో స్టార్‌ బ్యాటర్లు సైతం షాట్లు ఆడేందుకు వెనుకాడితే.. జురెల్‌ మాత్రం ..‘‘నువ్వు ఎంత తోపు బౌలర్‌ అయినా.. నేను సరైన రీతిలో షాట్‌ కొడితే సిక్సరే’’ అన్నట్లు అదరగొట్టాడంటూ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా మూడో టెస్టులో మొత్తంగా 104 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్‌ జురెల్‌ 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. అరంగేట్ర హాఫ్‌ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

ఇక ఈ మ్యాచ్‌ ద్వారా జురెల్‌తో పాటు అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌(66 బంతుల్లో 62 రన్స్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అర్థ శతకం బాదిన విషయం తెలిసిందే. కాగా రాజ్‌కోట్‌ టెస్టులో రోహిత్‌ శర్మ(131), రవీంద్ర జడేజా(112) సెంచరీలు.. సర్ఫరాజ్‌ హాఫ్‌ సెంచరీలు.. జురెల్‌(46), అశ్విన్‌(37) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగులు చేసింది. 

చదవండి: Dhruv Jurel Life Story In Telugu: తండ్రి కార్గిల్‌ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement