తన చర్యతో కట్టిపడేసిన క్రికెటర్‌.. వీడియో​ వైరల్‌ | Mark Wood Misses Team huddle Later Does Hurdle Pose From Other End Viral | Sakshi
Sakshi News home page

Mark Wood: తన చర్యతో కట్టిపడేసిన క్రికెటర్‌.. వీడియో​ వైరల్‌

Published Thu, Mar 10 2022 2:02 PM | Last Updated on Thu, Mar 10 2022 3:53 PM

Mark Wood Misses Team huddle Later Does Hurdle Pose From Other End Viral - Sakshi

ఇంగ్లండ్‌ జట్టు ప్రస్తుతం కరీబియన్‌ పర్యటనలో ఉ‍న్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు నేపథ్యంలో ఆట రెండోరోజు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ మార్క​వుడ్‌ తన చర్యలతో ఆకట్టుకోవడమేగాక  అభిమానులను కట్టిపడేస్తోంది. విషయంలోకి వెళితే.. రెండోరోజు ఆటలో విండీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా బ్రేక్‌ సమయంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లంతా ఒక​దగ్గర చేరి గేమ్‌ స్టా‍్రటజీని చర్చించుకున్నారు. రూట్‌ ఆధ్వర్యంలోని జట్టు మొత్తం ఒక దగ్గర ఉంటే.. బౌలర్‌ మార్క్‌ వుడ్‌ మాత్రం ఫైన్‌లెగ్‌లో ఉన్నాడు. అతను వారి దగ్గరకు రాలేకపోయాడు.

తన సహచరులంతా ఒకచోట చేరి వారి సలహాలను పేర్కొంటున్న సమయంలో మార్క్‌ వుడ్‌ ఉన్న స్థానంలో అలాగే నిల్చుండిపోయాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడో తెలియదు కాని.. వెంటనే తన రెండు చేతులతో సహచరులతో కలిసి గేమ్‌ప్లాన్‌ చర్చలో పాల్గొన్నట్లు ఒక సిగ్నేచర్‌ ఇచ్చాడు. అది తాను ఉన్న స్థానం నుంచే.. ఇది చూసిన అభిమానులు నవ్వుకోవడమేగాక.. మార్క్‌ వుడ్‌ చర్యను అభినందిస్తూ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ 66.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. జాసన్‌ హోల్డర్‌ 43, క్రుమ్హా బొనర్‌ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు వద్ద ఆలౌటైంది. జానీ బెయిర్‌ స్టో 140 పరుగులు చేసి ఔట్‌ కాగా..  క్రిస్‌ వోక్స్‌ 2, ఫోక్స్‌ 42 పరుగులు సాధించారు. విండీస్‌ బౌలర్లలో జైడెన​ సీల్స్‌ 4, కీమర్‌ రోచ్‌, హోల్డర్‌, అల్జారీ జోసెఫ్‌ తలా రెండు వికెట్లు తీశారు.  

చదవండి: ధోనికి అవమానం.. గరం అవుతున్న అభిమానులు!

Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్‌ చేయలేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement