
ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ దెబ్బకు ఉస్మాన్ ఖవాజా మైండ్ బ్లాక్ అయింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు మూడో టెస్టు ఆడుతున్నాయి. తొలిరోజు ఆటలో భాగంగా టాస్ గెలిచిన స్టోక్స్ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. స్టోక్స్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ బౌలర్లు తొలి సెషన్‌లోనే చెలరేగిపోయారు. లంచ్ విరామ సమయానికి నాలుగు వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బతీశారు.
స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీసినప్పటికి.. హైలెట్ అయింది మాత్రం మార్క్ వుడ్ అని చెప్పొచ్చు. యాషెస్ సిరీస్‌లో మార్క్ వుడ్‌కు ఇదే తొలి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు విసురుతూ ఆసీస్‌కు చాలెంజ్ విసురుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఖవాజాను ఔట్ చేసిన 13వ ఓవర్‌లో మార్క్‌వుడ్ ప్రతీ బంతిని గంటకు 90 మైళ్ల వేగంతో విసరడం విశేషం. గుడ్‌లైన్ అండ్ లెంగ్త్‌తో సంధించిన మార్క్‌వుడ్ ఆఖరి బంతిని ఇన్‌స్వింగర్ వేశాడు. బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొని ఖవాజా కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. 96.5 మైళ్ల వేగం(గంటకు 152 కిమీ)తో వచ్చిన బంతి దెబ్బకు స్టంప్ ఎగిరి కింద పడింది. ఇక యాషెస్ చరిత్రలో మార్క్ వుడ్ వేసిన బంతి రెండో ఫాస్టెస్ట్ డెలివరీగా నిలిచింది. ఇంతకముందు ఆసీస్ స్టార్ మిచెల్ జాన్సన్ 2013 యాషెస్ సిరీస్‌లో గంటకు 97 మైళ్ల వేగం(గంటకు 156.7 కిమీ)తో బంతిని విసిరాడు. ఇప్పటికి ఈ రికార్డు యాషెస్ చరిత్రలో పదిలంగా ఉంది.
అంతకముందు స్టువర్ట్ బ్రాడ్.. వార్నర్‌ను(4 పరుగులు), వందో టెస్టు ఆడుతున్న స్మిత్(22 పరుగులు) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక మార్నస్ లబుషేన్‌ను(21 పరుగుల) క్రిస్ వోక్స్ పెవిలియన్ చేర్చాడు. లంచ్ అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ప్రస్తుతం 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసిది. మిచెల్ మార్ష్ 30, ట్రెవిస్ హెడ్ 17 పరుగులతో ఆడుతున్నారు.
It's full and straight and far too quick for Usman Khawaja 🌪️
— England Cricket (@englandcricket) July 6, 2023
Australia are 2 down and Mark Wood is on fire! 🔥 #EnglandCricket | #Ashes pic.twitter.com/y5MAB1rWxd
చదవండి: #SteveSmith: వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు
#GlennMcGrath: ఇంగ్లండ్‌కు ఆసీస్ దిగ్గజం చురకలు.. 'బజ్‌బాల్ కాదది కజ్‌బాల్'