
స్వదేశంలో టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టిఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం కారణంగా భారత్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. వుడ్ ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వుడ్ ఎడమ మోకాలికి గాయమైంది.
దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి వుడ్ వైదొలిగాడు. అయితే అతడు కోలుకోవడానికి కనీసం నాలుగు నెలల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే టీమిండియాతో సిరీస్‌కు వుడ్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం ధ్రువీకరించాడు. అతడు త్వరలోనే తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. ఈ ఏడాది జూలై ఆఖరిలో తిరిగి అతడు జట్టులోకి వచ్చే అవకాశముంది.
కాగా మార్క్ వుడ్ కూడా తన గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. "గత ఏడాది ఆరంభం నుంచి ఎటువంటి విరామం లేకుండా అన్నిఫార్మాట్లలో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాను. కానీ దురదృష్టవశాత్తూ మళ్లీ గాయ పడటం నిజంగా నాకు చాలా బాధగా ఉంది.
అయితే వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను. నాకు మద్దతుగా నిలిచిన వైద్యులు, కోచింగ్ స్టాప్, ఇంగ్లండ్ క్రికెట్, నా సహచరులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని వుడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
ఇదేమి తొలిసారి కాదు..
కాగా మార్క్ వుడ్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండడం ఇదేమి తొలిసారి కాదు. అతడు తన కెరీర్ ఆరంభం నుంచి గాయాలతో సావాసం చేస్తున్నాడు. గతేడాది ఆరంభంలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కూడా వుడ్ గాయం కారణంగా దూరమయ్యాడు.
2019లో కూడా అతడు తన మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు అతడు గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో మరోసారి తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఈ టెస్టు సిరీస్ జరగనుంది. జూన్‌లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: హార్దిక్ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment