India Vs England Memes: Virat Kohli Hilarious Expression Goes Viral - Sakshi
Sakshi News home page

కోహ్లి.. నీ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి!

Published Wed, Feb 17 2021 11:10 AM | Last Updated on Wed, Feb 17 2021 3:17 PM

Hilarious Expression Of Virat Kohli During Chennai Test Became Viral - Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం సంగతి పక్కనబెడితే కెప్టెన్ విరాట్‌‌ కోహ్లి చర్య ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి హావభావాలపై నెటిజన్లు సోషల్‌ మీడియాలో మీమ్స్‌, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. అసలు విషయంలోకి వెళితే.. రెండో టెస్టు సందర్భంగా టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో కోహ్లి డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చొని మ్యాచ్‌ వీక్షిస్తున్నాడు. ఇదే సమయంలో తన ఎదురుగా ఏం కనిపించిందో తెలియదుగాని.. కోహ్లి అస్సలు ఇష్టం లేనట్లుగా ఒక ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు.

కోహ్లి ఎక్స్‌ప్రెషన్‌ చూస్తే.. దానిని అసహ్యించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. నెటిజన్లు తమదైన మీమ్స్‌, ట్రోల్స్‌తో చెలరేగిపోయారు. 'కోహ్లికి చాయ్‌ ఇష్టం లేనట్లు ఉంది.. అందుకే ముఖాన్ని వికారంగా పెట్టాడు.. జీవితంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ ఎక్కడ తప్పు చేశానో.. రాక్షాబంధన్‌ రోజు అబ్బాయిలను స్కూల్‌కు పంపితే ఎలా ఉంటుందో అలా ఉంది కోహ్లి పరిస్థితి' అంటూ రకరకాల మీమ్స్‌ పెట్టేశారు. దీంతో కోహ్లి ఫోటో ట్రెండింగ్‌ లిస్ట్‌లో చేరిపోయింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. పర్యాటక జట్టు 317 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూసింది. సొంతగడ్డపై అశ్విన్‌ సెంచరీతో పాటు రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. ప్రస్తుతం ఇరు జట్లు నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమాంగా ఉన్నాయి. మూడోటెస్టు మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీ నుంచి డే నైట్‌ పద్దతిలో జరగనుంది.
చదవండి: ధోని రికార్డు సమం.. కోహ్లి ఖాతాలోనే ఐదు
బంతి దొరకడమే ఆలస్యం.. సూపర్‌ స్టంపింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement