'కమాన్‌ రోహిత్‌.. యూ కెన్‌ డూ ఇట్‌' | Watch Virat Kohli Gesture After Rohit Sharma Stunning Cover Drive | Sakshi
Sakshi News home page

'కమాన్‌ రోహిత్‌.. యూ కెన్‌ డూ ఇట్‌'

Published Sat, Feb 13 2021 12:37 PM | Last Updated on Sat, Feb 13 2021 1:01 PM

Watch Virat Kohli Gesture After Rohit Sharma Stunning Cover Drive - Sakshi

చెన్నై: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిల మధ్య సరైన సఖ్యత లేదంటూ కొంతకాలం కిందట వార్తలు హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ సిరీస్‌కు ముందు రోహిత్‌కు కోహ్లితో విభేదాలు ఉన్నాయని.. అందుకే అతను ఐపీఎల్‌ తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడంటూ కథనాలు కూడా వచ్చాయి. ఆసీస్‌ సిరీస్‌ జరుగుతుండగానే పెటర్నిటీ సెలవులపై కోహ్లి స్వదేశానికి రావడం.. ఫిట్‌నెస్‌ పరీక్షలో రోహిత్‌ పాసై ఆసీస్‌ టూర్‌కు బయలుదేరడం ఒకేసారి జరగడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ మరోసారి వార్తలు వచ్చాయి. అయితే వీటిపై కోహ్లి, రోహిత్‌లు ఇంతవరకు స్పందించలేదు.

తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వీరిద్దరి మధ్య ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అయితే ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ తన ట్రేడ్‌మార్క్‌ షాట్‌ అయిన కవర్‌ డ్రైవ్‌తో పరుగుల ఖాతాను ఆరంభించాడు. రోహిత్‌ షాట్‌ను డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న కోహ్లి చూసి యస్‌ బాయ్‌.. కమాన్‌ రోహిత్‌.. యూ క్యాన్‌ డూ ఇట్‌ అంటూ బిగ్గరగా అరవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న టీమిండియాకు ఆదిలోనే గిల్‌ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఖాతా తెరవకుండానే గిల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

వన్డే తరహాలో దాటిగా ఆడిన రోహిత్‌ 47 బంతుల్లోనే 12వ హాఫ్‌ సెంచరీ సాధించాడు. లంచ్‌ విరామానికి ముందు టీమిండియా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 21 పరుగులతో నిలకడగా ఆడుతున్న పుజారా జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో అవుట్‌ కాగా.. తర్వాత వచ్చిన కోహ్లి అలీ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరగడంతో టీమిండియా 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 3 వికెట్ల నష్టానికి 106 పరగుల వద్ద లంచ్‌ విరామానికి వెళ్లిన టీమిండియా ప్రస్తుతం 112 పరుగులు చేసింది. రోహిత్‌ 82, రహానే 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చదవండి: 'నేను రిషబ్‌ పంత్‌.. కొత్త ఉత్సాహంతో ఉన్నా'
ఫ్యాన్స్‌తో కళకళలాడుతున్న చెపాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement