వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తరపున ముకేశ్ కుమార్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా కిర్క్ మెకెంజీ రూపంలో ముకేశ్ కుమార్ తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. 32 పరుగులు చేసిన మెకెంజీ ముకేశ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
టీమిండియా తరపున అంతర్జాతీయ అరేగంట్రం చేసిన 395వగా ఆటగాడిగా ముఖేష్ కుమార్ నిలిచాడు.కాగా దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ముఖేష్ కుమార్‌కు చోటు దక్కడం లేదు. అయితే రెండో టెస్టుకు గాయం కారణంగా పేసర్ శార్ధూల్ ఠాకూర్ దూరం కావడంతో.. ముఖేష్ ఎంట్రీకి మార్గం సుగమమైంది.
ఇదిలా ఉంటే టీమిండియా తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ముకేశ్‌కుమార్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్‌కాల్‌లో తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ''హలో అమ్మా.. నీ ప్రార్థనలకు ఈరోజు సమాధానం దొరికింది. ఎట్టకేలకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందంటూ తల్లితో పేర్కొన్నాడు. ముకేశ్ తల్లి స్పందిస్తూ.. సంతోషంగా ఉండు.. కెరీర్‌లో ఎదిగే ప్రయత్నం చెయ్యు.. నా దీవెనలు ఎప్పుడు నీ వెంట ఉంటాయి'' అంటూ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ వీడియో రూపంలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
2015లో బెంగాల్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి ముఖేష్ అడుగుపెట్టాడు. 2018-19 రంజీ సీజన్‌లో తన సత్తా ఎంటో క్రికెట్ ప్రపంచానికి ముఖేష్ తెలియజేశాడు. ఆ సీజన్‌లో కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో 6 వికెట్లు పడగొట్టి.. బెంగాల్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత ముఖేష్ తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూడలేదు.
తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 39 మ్యాచ్‌లు ఆడిన అతడు 149 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2023 మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వచ్చిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించాడు. అనంతరం డబ్ల్యూటీసీ ఫైనల్- 2023కి స్టాండ్ బైగా కూడా ఎంపికయ్యాడు.
No Dream Too Small! 🫡
— BCCI (@BCCI) July 21, 2023
Mukesh Kumar's phone call to his mother after his Test debut is all heart ❤️#TeamIndia | #WIvIND pic.twitter.com/Sns4SDZmi2
Mukesh Kumar's maiden Test wicket! A moment for him to savour. A video for you to savour. #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/fpCQSf1LsF
— FanCode (@FanCode) July 22, 2023
చదవండి: #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్‌ప్రీత్.. కుండ బద్దలయ్యేలా!
Comments
Please login to add a commentAdd a comment