WI Vs IND 1st Test: Ishan Kishan Teasing Virat Kohli Recorded In Stump Mic, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Kohli-Ishan Kishan Viral Video: కోహ్లిని టీజ్‌ చేసిన ఇషాన్‌ కిషన్‌.. వీడియో వైరల్‌

Published Thu, Jul 13 2023 9:18 AM | Last Updated on Thu, Jul 13 2023 10:20 AM

WI Vs IND: Ishan Kishan Tease-Kohli Recorded-Stump-Mic 1st Test Viral - Sakshi

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్‌ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్‌ ఐదు వికెట్లతో చెలరేగితే.. జడ్డూ మూడు వికెట్లతో విండీస్‌ బ్యాటర్ల నడ్డి విరిచారు. అలిక్‌ అతానజే 47 పరుగులు మినహా మిగతావారు పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. జైశ్వాల్‌ 40, రోహిత్‌ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 70 పరుగులు వెనుకబడి ఉంది.

కాగా మ్యాచ్‌ సమయంలో కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ విరాట్‌ కోహ్లిని టీజ్‌ చేయడం ఆసక్తిగా మారింది. అశ్విన్‌ బౌలింగ్‌ వేస్తున్న సమయంలో ఇది జరిగింది. బంతి వేసిన తర్వాత ఇషాన్‌ కిషన్‌ కోహ్లిని ఉద్దేశించి.. ''Virat Bhai Thoda Sa Sidha konasi jGH Dhund Li Bhai'' అంటూ పేర్కొన్నాడు. కాగా ఇషాన్‌ కిషన్‌ వ్యాఖ్యలు స్టంప్‌ మైక్‌లో రికార్డ్‌ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

చదవండి: #MohammedSiraj: 'సూపర్‌మ్యాన్‌' సిరాజ్‌.. కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement