డోంట్‌ మిస్‌.. కోహ్లి సేన స్పందన.. ఈ వీడియో చూశారా? | Ind Vs Eng 4th Test: BCCI Shares Unseen Visuals From Dressing Room | Sakshi
Sakshi News home page

Ind Vs Eng: కోహ్లి సేన సంబరం.. ఈ వీడియో చూశారా?

Published Tue, Sep 7 2021 2:03 PM | Last Updated on Tue, Sep 7 2021 8:10 PM

Ind Vs Eng 4th Test: BCCI Shares Unseen Visuals From Dressing Room - Sakshi

లండన్‌: ఓవల్‌ మైదానంలో 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా విజయం నమోదు చేసిన కోహ్లి సేన సంబరంలో మునిగిపోయింది. చారిత్రాత్మక విజయం సాధించి.. అభిమానుల చేత జేజేలు పలికించుకుంటోంది. ఇక నాలుగో టెస్టులో గెలుపు ఖాయం కాగానే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి... మైదానంలో చేసి హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి.. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 157 పరుగులతో విజయం సాధిస్తే ఆ మాత్రం హడావుడి ఉంటుందిలెండి!

చదవండి: ఇదీ ఇంగ్లండ్‌ ఆటగాళ్ల పరిస్థితి.. అంతేగా.. అంతేగా!

ఇక ఇంగ్లండ్‌పై తాజా విజయంతో సిరీస్‌లో 2-1తేడాతో ముందంజలో నిలిచిన భారత జట్టు.. ఐసీసీ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ 2021-23 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇదిలా ఉండగా.. విజయానంతరం టీమిండియా ఆటగాళ్ల సంతోషాన్ని కళ్లకు గట్టే వీడియోను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘‘అస్సలు మిస్సవకండి. అన్‌సీన్‌ విజువల్స్‌ మీకోసమే. చారిత్రాత్మక విజయం తర్వాత మా ఆటగాళ్ల స్పందన’’ అని పేర్కొంది. ఇందులో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోహిత్‌ శర్మ, బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ తదితరులు గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సందడి చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి! 

టీమిండియా స్కోరు:
తొలి ఇన్నింగ్స్‌: 191-10 (61.3 ఓవర్లు)
రెండో ఇన్నింగ్స్‌: 466-10 (148.2 ఓవర్లు)

ఇంగ్లండ్‌ స్కోరు:
తొలి ఇన్నింగ్స్‌: 290-10 (84 ఓవర్లు)
రెండో ఇన్నింగ్స్‌: 210-10 (92.2 ఓవర్లు)

చదవండి: ICC Test Championship 2021-23: అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement