
విరాట్ కోహ్లి ఎక్కడ? అతడికి ఏమైంది? ఎప్పుడు తిరిగి వస్తాడు? ఇవన్నీ టీమిండియా సూపర్ స్టార్ గురించి గత కొన్ని రోజులగా క్రీడా వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్.. సిరీస్ మొత్తానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలన్నీ రూమర్సే అని సదరు అధికారి కొట్టిపారేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టుకు విరాట్ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉందని ఆయన తెలిపారు.
విరాట్ కోహ్లి తను మూడో టెస్టుకు అందుబాటులో ఉండనని మాకు ఇప్పటివరకు అయితే తేలియజేయలేదు. అతను మొదటి రెండు టెస్టుల గురించి మాత్రమే బోర్డుకు సమాచారమిచ్చాడు. ఒకవేళ అతడి నుంచి ఎటువంటి సమాచారం రాకపోతే జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లే. దీనిపై ఒకటి రెండు రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు.
కాగా కోహ్లి భార్య అనుష్క శర్మ గర్భవతిగా ఉన్నందునే ఇంగ్లండ్ సిరీస్‌కు అతడు అందుబాటులో లేనట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు, ఆర్సీబీలోకి ఒకప్పటి కోహ్లి సహచర ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కూడా దృవీకరించాడు. ఇక ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ఈ వారంలో ప్రకటించే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment