Shreyas Iyer Century in Debut match: టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో పలు రికార్డులు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్ సెంచరీతో మెరిశాడు. తద్వారా అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా ఘనత సాధించాడు.
అదే విధంగా డెబ్యూ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. 168 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు శ్రేయాస్ అయ్యర్ సాధించాడు. 105 పరుగులు చేసిన అయ్యర్ సౌథీ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాగా తొలి రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ చేతుల మీదుగా టీమిండియా క్యాప్(303)ను శ్రేయస్ అయ్యర్ అందుకున్నాడు.
🎥 A moment to cherish for @ShreyasIyer15 as he receives his #TeamIndia Test cap from Sunil Gavaskar - one of the best to have ever graced the game. 👏 👏#INDvNZ @Paytm pic.twitter.com/kPwVKNOkfu
— BCCI (@BCCI) November 25, 2021
చదవండి: IND-A Vs SA- A: టీమిండియా బౌలర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్.. అంపైర్‌పై కోపంతో ఏం చేశాడంటే..
Comments
Please login to add a commentAdd a comment