న్యూఢిల్లీ : సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం ఈ రోజు ఆస్ట్రేలియా క్రికెట్ స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ అరంగ్రేటం చేసిన రోజు. 1992, జనవరి 2న సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించారు వార్న్.
ప్రస్తుత టీమిండియా కోచ్‌ను రవిశాస్త్రి అవుట్ చేయడం ద్వారా తన టెస్టు వికెట్ల ఖాతాను తెరిచారు. మిగిలిన మ్యాచ్‌లలో భారత జట్టుపై వార్న్ అంతగా ప్రభావం చూపలేదు. 1993లో జరిగిన కొన్ని టెస్టు మ్యాచ్‌లలో విఫలమైనా.. యాషెస్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు.
దీంతో వార్న్ మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 2007లో జరిగిన యాష్‌స్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను 708 వికెట్‌గా అవుట్ చేసిన వార్న్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వార్న్ పదిహేనేళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2003లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో క్రికెట్ నుంచి నిషేధానికి గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment