
లండన్: న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే అరంగేట్రం ఇన్నింగ్స్‌తోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్శించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే డబుల్ సెంచరీ సాధించి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో టిప్ ఫోస్టర్(287), జాక్ రుడాల్ఫ్(222*), లారెన్స్ రోవ్(214), మాథ్యూ సింక్లెయిర్(214), బ్రెండన్ కురుప్పు(201*)లు టెస్ట్ డెబ్యూలో డబుల్ కొట్టారు.
మాథ్యూ సింక్లెయిర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కివీస్ ఆటగాడిగా కాన్వే రికార్డు నెలకొల్పాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కాన్వే మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ డెబ్యూలో బౌండరీతో సెంచరీని, సిక్సర్‌తో ద్విశతకాన్ని సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. అంతకుముందు తొలి రోజు ఆటలో లార్డ్స్ మైదానంలో గంగూలీ 25 ఏళ్ల కిందట నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టిన కాన్వే.. తాజాగా డబుల్ సాధించి అరుదైన క్రికెటర్ల క్లబ్‌లోకి చేరాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో కాన్వే(347 బంతుల్లో 200; 22 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ద్విశతకంతో పోరాడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. అతనికి హెన్నీ నికోల్స్(61), నీల్ వాగ్నర్(25 నాటౌట్) సహకరించడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం బౌలర్ రాబిన్సన్ 4 వికెట్లు పడగొట్టగా, మార్క్ వుడ్ 3, అండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు.
చదవండి: కోహ్లీతో నన్ను పోల్చకండి.. అతని స్టైల్ వేరు, నా స్టైల్ వేరు
Comments
Please login to add a commentAdd a comment