England v New Zealand
-
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. తొలి రోజు న్యూజిలాండ్‌దే..
నాటింగ్హమ్: ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 318 పరుగులు సాధించింది. మిచెల్ (81 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్లన్‌డెల్ (67 బ్యాటింగ్; 8 ఫోర్లు) ఐదో వికెట్‌కు అజేయంగా 149 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, స్టోక్స్ రెండేసి వికెట్లు తీశారు. కరోనాతో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. చదవండి: Babar Azam-Imam-ul-Haq: వన్డే క్రికెట్ చరిత్రలో పాక్ బ్యాటర్స్ అరుదైన ఫీట్ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..!
న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్‌లతో బీజీగా ఉన్న న్యూజిలాండ్ తొలి టెస్టుకు సిద్దమైంది. ఇక ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లార్డ్స్ వేదికగా జూన్ 2న ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. బౌల్ట్ ప్రస్తుతం ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో భాగమైన్నాడు. ఇక క్వాలిఫయర్ 2లో ఆర్సీబీపై విజయం సాధించి రాజస్తాన్ ఫైనల్‌కు చేరింది. ఆదివారం(మే 29) ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ తలపడనుంది. అయితే న్యూజిలాండ్ కాలమానం ప్రకారం ఫైనల్ మ్యాచ్ సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గురువారం జరగనున్న తొలి టెస్టుకు బౌల్ట్ సిద్దం కావడం అసాధ్యం. కాబట్టి తొలి టెస్టుకు అతడు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ బౌల్ట్ తొలి టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో టిమ్ సౌథీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, జాకబ్ డఫీ, కామెరాన్ ఫ్లెచర్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్, రచిన్ రవీంద్ర, హమీష్ రూథర్‌ఫోర్డ్, టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, విల్ యంగ్ చదవండి: ENG Vs NZ Test Series 2022: ఇంగ్లండ్‌తో టెస్టులకు కివీస్ జట్టును ప్రకటన.. కేన్ విలియమ్సన్ వచ్చేశాడు! -
రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు
Many Similarities In Two Semi Finals Of T20 World Cup 2021: టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నవంబర్ 11న జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. పాక్‌కు ఊహించని షాకిచ్చి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు రోజు(నవంబర్ 10) న్యూజిలాండ్ సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి.. దిగి పటిష్ట ఇంగ్లండ్‌ను మట్టికరిపించి తుది సమరానికి అర్హత సాధించింది. అయితే, 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు సెమీ ఫైనల్స్‌లో కొన్ని ఆసక్తికర పోలికలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రెండు మ్యాచ్‌లు రెండు వేర్వేరు నగరాల్లో జరిగినా.. అందులో చాలా విషయాలు యాదృచ్ఛికంగా ఒకేలా ఉన్నాయి. న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య అబుదాబి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందగా.. పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరిగిన రెండో సెమీస్‌లో ఆసీస్ ఇదే మార్జిన్(5 వికెట్ల తేడా)తో పాక్‌పై విజయం సాధించింది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ ఓ ఓవర్ ముందుగా లక్ష్యాన్ని(167 పరుగులు) ఛేదించగా.. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా కూడా పాక్‌పై ఇదే తరహా(19 ఓవర్లలో 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది)లో విజయం సాధించింది. రెండు సెమీ ఫైనల్స్‌లో కివీస్, ఆసీస్ జట్లు చివరి 5 ఓవర్లలో 60 ప్లస్ పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రెండు మ్యాచ్‌ల్లో కివీస్, ఆసీస్ జట్లకు చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరం కాగా.. మరో ఓవర్ మిగిలుండగానే ఇరు జట్లు టార్గెట్‌ను చేరుకున్నాయి. ఇదిలా ఉంటే, నవంబర్ 14న జరిగే తుది సమరంలో ఆసీస్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు టైటిల్ నెగ్గినా చరిత్ర కానుంది. ఇప్పటివరకు ఆసీస్, కివీస్ జట్లు టీ20 ప్రపంచకప్‌ను నెగ్గలేదు. చదవండి: T20 World Cup 2021: హసన్ ఆలీ భార్యపై అసభ్య కామెంట్లు చేస్తున్న పాక్ అభిమానులు -
ఇంగ్లండ్‌కు షాకిచ్చిన కివీస్.. 21 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం
బర్మింగ్‌హామ్: ఆతిధ్య ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ను అతికష్టం మీద డ్రా చేసుకోగలిగిన ఇంగ్లండ్.. రెండో టెస్ట్‌లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తేడాతో కైవసం చేసుకున్న పర్యాటక జట్టు.. 21 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో రోరీ బర్న్స్(81), లారెన్స్(81 నాటౌట్) రాణించడంతో 303 పరగులు స్కోర్ చేసింది. బౌల్ట్‌కు 4, హెన్రీ 3, అజాజ్ పటేల్ 2, వాగ్నర్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం కాన్వే(80), యంగ్(82), రాస్ టేలర్(80) అర్ధసెంచరీలతో రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 388 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు 4 వికెట్లు దక్కాయి. అయితే ఆతర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మ్యాట్ హెన్రీ(3/36), వాగ్నర్ (3/18), బౌల్ట్ (2/34) ధాటికి ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 122కే ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మార్క్ వుడ్(29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ గెలుపుకు .. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 85 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి 38 పరగులు అవసరమైంది. ఈ లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇంగ్లండ బౌలర్లు బ్రాడ్, స్టోన్‌కు తలో వికెట్ దక్కగా, ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు మ్యాట్ హెన్రీకి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు డెవాన్ కాన్వే, ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్‌కు సంయుక్తంగా దక్కింది. చదవండి: శతక్కొట్టిన పంత్.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్ -
వాళ్లు నిజంగా జాత్యహంకారులే.. ఇప్పటికీ మన యాసను ఎగతాలి చేస్తారు
న్యూఢిల్లీ: ఇంగ్లీష్ క్రికెటర్ ఓలీ రాబిన్సన్ ఎపిసోడ్‌పై భారత మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజినీర్ స్పందించాడు. రాబిన్సన్ ఎనిమిదేళ్ల కిందట చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించాడు. అతని విషయంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) నిర్ణయం సరైందేనని, మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై జీవితకాల నిషేదం విధించాలని ఈసీబీని కోరాడు. ఈ సందర్భంగా రాబిన్సన్ను వెనకేసుకొచ్చిన వారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. గతంలో తాను లాంకషైర్ కౌంటీకి ప్రాతినిధ్యం వహించే రోజుల్లో జాతి వివక్షను ఎదుర్కొన్నానని, ఇంగ్లీష్ వాళ్లు భారతీయుల పట్ల అహంకారులుగా వ్యవహరించే వాళ్లని తెలిపాడు. వాళ్లు అప్పుడు ఇప్పుడు మన యాసను ఎగతాలి చేస్తున్నారని, వాళ్లలో జాత్యాంహంకారం బుసలు కొడుతుందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ అయితే తరచూ బ్లడీ ఇండియన్స్ అంటూ సంబోధించేవాడని, అలాంటి వాడిని మన వాళ్లే అందలమెక్కించారని వాపోయాడు. ఈ విషయంలో ఇంగ్లీష్ క్రికెటర్ల తర్వాత ఆసీస్ ఆటగాళ్లుంటారని, వాళ్లు కూడా భారతీయుల పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తారని పేర్కొన్నాడు. ఒకప్పుడు మనపై వివక్ష చూపిన వాళ్లంతా ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా అని మన బూట్లు నాకుతున్నారని దుయ్యబట్టాడు. ఇంగ్లీష్ క్రికెటర్లు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారని, వాళ్ల నిజస్వరూపమేంటో తనకు తెలుసునని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన రాబిన్సన్.. తాను టీనేజర్‌గా ఉన్న సమయంలో ఆసియా వాసులు, ముస్లింలపై జాతి వివక్ష ట్వీట్లు చేశాడన్న ఆరోపణలపై ఈసీబీ అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: క్రికెట్ చరిత్రలో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే అత్యుత్తమం -
పాపం రాబిన్సన్.. క్షమించమని కోరినా కనికరించలేదు
లండన్: ఎనిమిదేళ్ల క్రితం మిడిమిడి జ్ఞానంతో చేసిన తప్పిదానికి ఇంగ్లండ్ యువ పేసర్ ఓలీ రాబిన్సన్ ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడని టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విచారం వ్యక్తం చేశాడు. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన 27 ఏళ్ల రాబిన్సన్.. 2013లో సోషల్ మీడియా వేదికగా స్త్రీల పట్ల అనుచిత వ్యాఖ్యలతో పాటు జాత్యాంహకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతనిపై విచారణ చేపట్టి, అతన్ని తక్షణమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ వ్యవహారంపై టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ట్విటర్ వేదికగా ఓలీ రాబిన్సన్కు మద్దతు తెలుపుతూనే.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోని ప్రవర్తించాలని ఈ తరం ఆటగాళ్లను హెచ్చరించాడు. ఈ సందర్భంగా ఆయన ఈసీబీ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. రాబిన్సన్ అప్పుడెప్పుడో చేసిన తప్పుకు క్షమించమని కోరినా ఈసీబీ ఇంత కఠినంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టాడు. టెస్ట్ కెరీర్లో అద్భుతమైన ఆరంభం లభించిన ఆటగాడిని ఈ రకంగా శిక్షించడం బాధగా ఉందని వాపోయాడు. ఏదిఏమైనప్పటికీ.. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రస్తుత తరం ఆటగాళ్లకు ఇదో హెచ్చరిక లాంటిదని ట్వీట్ చేశాడు. కాగా, ఓలీ రాబిన్సన్ తన తొలి టెస్ట్‌లో 7 వికెట్లతో పాటు 42 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ డ్రాతో గట్టెక్కింది. కివీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ఓపెనర్ డామినిక్ సిబ్లీ 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కెప్టెన్ జో రూట్ (40) పర్వాలేదనిపించాడు. ఇక అరంగేట్రంలోనే ద్విశతకంతో అదరగొట్టిన కివీస్ ఆటగాడు డెవాన్ కాన్వేను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు, జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. చదవండి: నదాల్‌కు మళ్లీ పెళ్ళా.. ఫేస్బుక్ అప్డేట్ చూసి షాక్ తిన్న అభిమానులు -
England Vs Newzealand: తొలి టెస్ట్ డ్రా
లండన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు డ్రాగా ముగించుకోగలిగింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రోజు నుంచి అంతగా ప్రభావం చూపించని ఇంగ్లండ్ జట్టు ఎట్టకేలకు మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. కివీస్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ఆఖరి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ డామినిక్ సిబ్లీ 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, కెప్టెన్ జో రూట్ (40) పర్వాలేదనిపించాడు. రోరి బర్న్స్ (25), జాక్ క్రాలీ (2) ఆకట్టుకోలేకపోయినా.. చివర్లో సిబ్లేకు ఓలీ పోప్ (20) తోడుగా నిలిచాడు. కివీస్ బౌలర్లలో వాగ్నర్‌కు రెండు, సౌథీకి ఓ వికెట్ దక్కింది. అంతకుముందు 62/2 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్(36), రాస్ టేలర్(33) ఓ మోస్తరుగా రాణించగా, ఓలీ రాబిన్సన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. కాగా, అరంగేట్రం ఆటగాడు డెవాన్ కాన్వే ద్విశతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులు చేయగా, రోరీ బర్న్స్(132) శతకొట్టడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దారుణంగా దెబ్బ తీశాడు. ఇక అరంగేట్రంలోనే ద్విశతకంతో రాణించిన డెవాన్ కాన్వేను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన రెండో టెస్టు, జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది. చదవండి: కోహ్లీకి పెద్ద ఫ్యాన్‌ని అంటున్న ప్రముఖ పాక్ క్రికెటర్ భార్య.. -
టిమ్ సౌథీ 'ఆరే'యడంతో న్యూజిలాండ్‌కు ఆధిక్యం
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి, 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో టామ్ లాథమ్ (30), నీల్ వాగ్నర్ (1) ఉన్నారు. ఇంగ్లీష్ బౌలర్ ఓలీ రాబిన్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇంకా ఆటలో ఒక్కరోజే మిగిలి ఉండటంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా, వరణుడి దెబ్బకు మూడో రోజు ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. ఓవర్ నైట్ స్కోరు 111/2తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దారుణంగా దెబ్బ తీశాడు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను వరుసగా పెవిలియన్‌కు పంపాడు. సౌథీకి మరో పేసర్ కైల్ జేమిసన్ (3/85) తోడవ్వడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోరీ బర్న్స్ (132; 297 బంతుల్లో 16×4, 1×6) అద్భుత శతకానికి, కెప్టెన్ జో రూట్ (42), ఓలీ రాబిన్సన్ (42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తోడవ్వడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. వీరితో పాటు ఇంగ్లండ్ జట్టులో ఓలీ పోప్(22), స్టువర్ట్ బ్రాడ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. కాగా, ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 10 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు రెండో టెస్టులో తలపడనున్నాయి. ఈ సిరీస్ అనంతరం కివీస్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌తో తలపడనుంది. జూన్ 18న ఇరు జట్లు సౌతాంప్టన్ వేదికగా ప్రతిష్టాత్మకమైన పోరులో తలపడనున్నాయి. చదవండి: మా ఆయన మహా ముదురు.. అప్పటికే గర్ల్ ఫ్రెండ్ ఉండేది -
ఆట కోసం ఆస్తులమ్ముకున్నాడు.. దేశాన్ని కూడా వీడాడు
లండన్: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రంలోనే అద్భుతమైన ద్విశతకాన్ని సాధించి, రాత్రికి రాత్రే హీరోగా మారిపోయిన న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే గత జీవితం ఏమంత సాఫీగా సాగలేదన్న విషయం ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తుంది. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే కాన్వే.. ట్రైనింగ్ కోసం ఇల్లు, కారు సహా చాలా ఆస్తులు అమ్ముకున్నాడు. పుట్టింది దక్షిణాఫ్రికాలోనే అయినా.. క్రికెట్ కోసం దేశాన్ని వీడి న్యూజిలాండ్ బాట పట్టాడు. 2017 మార్చిలో దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్లో ఆఖరి మ్యాచ్ ఆడిన కాన్వే.. అందులో డబుల్ సెంచరీ సాధించి, ఆ దేశానికి గుడ్‌బై చెప్పాడు. అక్కడి నుంచి స్నేహితుల సహకారంతో వెల్లింగ్టన్కు చేరిన కాన్వే.. అక్కడే తన క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాడు. విక్టోరియా క్రికెట్ క్లబ్ కోచ్‌గా, బ్యాట్స్‌మెన్‌గా డ్యుయల్ రోల్ పోషిస్తూ, అవకాశాల కోసం ఎదురు చూశాడు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత న్యూజిలాండ్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న కాన్వే.. ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ అనతి కాలంలోనే ప్రపంచ ఖ్యాతి గడించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ సాధించిన అతను.. అండర్సన్, బ్రాడ్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ధీటుగా ఎదుర్కొని నిలబడి క్రికెట్ మక్కాలో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కాన్వే.. 347 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్స్‌తో 200 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని బ్యాటింగ్ తీరు చూసి మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యాడు. క్రికెట్‌ను ప్రాణంగా ప్రేమించే మరో స్టార్ ఆవిర్భవించాడంటూ ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 14 టీ20లు, 3 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన కాన్వే.. టీ20ల్లో 151.12 సగటులో 473 పరుగులు(4 అర్ధశతకాలు), వన్డేల్లో 75 సగటులో 225 పరుగులు(సెంచరీ, హాఫ్ సెంచరీ), టెస్ట్ క్రికెట్లో 200 పరుగులు సాధించాడు. చదవండి: ఎనిమిదేళ్ల క్రితం చేసిన ట్వీట్‌కు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు.. -
ఎనిమిదేళ్ల క్రితం చేసిన ట్వీట్‌కు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు..
లండన్: లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఒలీ రాబిన్సన్ గతంలో సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ కారణంగా వివాదాల్లో చిక్కుకున్నాడు. 27 ఏళ్ల రాబిన్సన్ 2012-13లో ట్విటర్ వేదికగా చేసిన జాత్యాంహకార వ్యాఖ్యలే ఇందుకు కారణం. దాదాపు ఎనిమిదేళ్ల కిందట రాబిన్సన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన పోస్ట్ తాజాగా వెలుగుచూడటంతో, అతనిపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) దర్యాప్తునకు ఆదేశించింది. ఈ అంశంపై ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ గ్రహం థోర్ఫ్ స్పందిస్తూ.. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికయ్యే అటగాళ్లకు సంబంధించిన సోషల్ మీడియా చరిత్ర ఆయా దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్‌లు పరిశీలనలోకి తీసుకుంటాయేమోనని వ్యాఖ్యానించాడు. యువ క్రికెటర్లు తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుల కారణంగా వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఇది సరైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే, రాబిన్సన్ కూడా ఈ విషయంపై స్పందించాడు. యుక్త వయసులో మిడిమిడి జ్ఞానంతో ఆ తప్పు చేశానని, ఇప్పుడు తాను పరిణితి చెందానని, ఏదిఏమైనా తాను అలాంటి లింగ పక్షపాతంతో కూడిన జాత్యాంహకార వ్యాఖ్యలు చేసి ఉండకూడదని క్షమాణలు చెప్పాడు. గతంలో తన చర్యల వల్ల సిగ్గుపడుతున్నానని, దయ చేసి సభ్య సమాజం తనను మన్నించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే, బుధవారం న్యూజిలాండ్‌తో మొదలైన తొలి టెస్ట్‌లో డెవాన్ కాన్వే అద్భుత ద్విశతకం సాయంతో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. మీడియం పేసర్ ఒలీ రాబిన్సన్(4/75), మార్క్ వుడ్(3/81), జేమ్స్ ఆండర్సన్(2/83)లకు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆరంభంలోనే డామినిక్ సిబ్లీ(0), జాక్ క్రాలీ(2)ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. రోరీ బర్న్స్(59 నాటౌట్), కెప్టెన్ జో రూట్(42 నాటౌట్) ఆదుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టానికి 111 పరుగులు సాధించింది. చదవండి: కోహ్లీ, రవిశాస్త్రి ఆడియో లీక్.. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు..
లండన్: న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే అరంగేట్రం ఇన్నింగ్స్‌తోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్శించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే డబుల్ సెంచరీ సాధించి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో టిప్ ఫోస్టర్(287), జాక్ రుడాల్ఫ్(222*), లారెన్స్ రోవ్(214), మాథ్యూ సింక్లెయిర్(214), బ్రెండన్ కురుప్పు(201*)లు టెస్ట్ డెబ్యూలో డబుల్ కొట్టారు. మాథ్యూ సింక్లెయిర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కివీస్ ఆటగాడిగా కాన్వే రికార్డు నెలకొల్పాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కాన్వే మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ డెబ్యూలో బౌండరీతో సెంచరీని, సిక్సర్‌తో ద్విశతకాన్ని సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. అంతకుముందు తొలి రోజు ఆటలో లార్డ్స్ మైదానంలో గంగూలీ 25 ఏళ్ల కిందట నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టిన కాన్వే.. తాజాగా డబుల్ సాధించి అరుదైన క్రికెటర్ల క్లబ్‌లోకి చేరాడు. కాగా, ఈ మ్యాచ్‌లో కాన్వే(347 బంతుల్లో 200; 22 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ద్విశతకంతో పోరాడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. అతనికి హెన్నీ నికోల్స్(61), నీల్ వాగ్నర్(25 నాటౌట్) సహకరించడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం బౌలర్ రాబిన్సన్ 4 వికెట్లు పడగొట్టగా, మార్క్ వుడ్ 3, అండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: కోహ్లీతో నన్ను పోల్చకండి.. అతని స్టైల్ వేరు, నా స్టైల్ వేరు -
350 పరుగులూ ఛేదించారు!
ఇంగ్లండ్ మరో సంచలన విజయం వన్డేల్లో నాలుగో అత్యుత్తమ లక్ష్యఛేదన సెంచరీలతో చెలరేగిన మోర్గాన్, రూట్ నాటింగ్‌హామ్: ప్రపంచ క్రికెట్ మొత్తం మారినా... సంప్రదాయ టెస్టు క్రికెట్ నీడలోనే ఉంటూ వన్డేలను పట్టించుకోని ఇంగ్లండ్ ఇప్పుడు మారినట్లుంది! వరల్డ్ కప్‌లో ఘోర వైఫల్యం తర్వాత ఆ జట్టు సొంతగడ్డపై చెలరేగి ఆడుతోంది. గతంలో తమకు అలవాటు లేని శైలిలో దూకుడును ప్రదర్శిస్తోంది. ఫలితంగా ఇంగ్లండ్ పేరిట ఎన్నడూ కనిపించని రికార్డు గణాంకాలు ఇప్పుడు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో వన్డేలో ఇది మళ్లీ కనిపించింది. 350 పరుగుల విజయలక్ష్యం...అయినా ఏ మాత్రం తడబాటు లేకుండా ఆ జట్టు అలవోకగా దీనిని అధిగమించింది. అదీ 7 వికెట్ల తేడాతో, మరో 6 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించడం మరో విశేషం. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (82 బంతుల్లో 113; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) జో రూట్ (97 బంతుల్లో 106 నాటౌట్; 13 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో కివీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. వీరికి అలెక్స్ హేల్స్ (38 బంతుల్లో 67; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), జాసన్ రాయ్ (35 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. అంతకు ముందు న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 349 పరుగులు చేసింది. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. చివరిదైన ఐదో వన్డే శనివారం చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరుగుతుంది. 4- వన్డే చరిత్రలో ఇది నాలుగో అత్యుత్తమ ఛేదన. ఇంగ్లండ్‌కు ఇదే అత్యుత్తమం. 1- ఇంగ్లండ్ తొలి సారిగా వరుసగా నాలుగు వన్డేలలో 300కు పైగా పరుగులు చేసింది.