న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్‌లతో బీజీగా ఉన్న న్యూజిలాండ్ తొలి టెస్టుకు సిద్దమైంది. ఇక ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లార్డ్స్ వేదికగా జూన్ 2న ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టు కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. బౌల్ట్ ప్రస్తుతం ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో భాగమైన్నాడు.
ఇక క్వాలిఫయర్ 2లో ఆర్సీబీపై విజయం సాధించి రాజస్తాన్ ఫైనల్‌కు చేరింది. ఆదివారం(మే 29) ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ తలపడనుంది. అయితే న్యూజిలాండ్ కాలమానం ప్రకారం ఫైనల్ మ్యాచ్ సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గురువారం జరగనున్న తొలి టెస్టుకు బౌల్ట్ సిద్దం కావడం అసాధ్యం. కాబట్టి తొలి టెస్టుకు అతడు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ బౌల్ట్ తొలి టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో టిమ్ సౌథీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, జాకబ్ డఫీ, కామెరాన్ ఫ్లెచర్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్, రచిన్ రవీంద్ర, హమీష్ రూథర్‌ఫోర్డ్, టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, విల్ యంగ్
Comments
Please login to add a commentAdd a comment