
దక్షిణాఫ్రికాను గెలిపించిన మోరిస్
జొహన్నెస్‌బర్గ్: ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (38 బంతుల్లో 62; 3 ఫోర్లు; 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు గట్టెక్కింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. నిర్ణాయక ఆఖరి వన్డే నేడు (ఆదివారం) కేప్‌టౌన్‌లో జరుగుతుంది. 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ 210 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మోరిస్ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు.
తొమ్మిదో వికెట్‌కు అబాట్ (3 నాటౌట్)తో కలిసి 52 పరుగులు జత చేసి విజయానికి మరో పరుగు దూరంలో అవుటయ్యాడు. తాహిర్ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 262 పరుగులు చేసింది. జో రూట్ (124 బంతుల్లో 109; 10 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీ చేయగా... హేల్స్ (56 బంతుల్లో 50; 7 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. రబడాకు నాలుగు, తాహిర్‌కు మూడు వికెట్లు దక్కాయి.