
దుబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదూత్ పడిక్కల్‌పై సహచర ఆటగాడు క్రిస్ మోరిస్ ప్రశంసలు కురిపించాడు. తాను ఆడుతున్న ఆరంభపు ఐపీఎల్ సీజన్‌లోనే అదరగొడుతున్న పడిక్కల్ అచ్చం ఆసీస్ దిగ్గజ క్రికెటర్ మాథ్యూ హేడెన్ తరహాలోనే ఆడుతున్నాడన్నాడు. హేడెన్‌ను పడిక్కల్ గుర్తుచేస్తున్నాడని మోరిస్ కొనియాడాడు. షాట్ సెలక్షన్‌లో పడిక్కల్‌ను చూస్తుంటే హేడెన్ జ్ఞప్తికివస్తున్నాడన్నాడు. ‘అరోన్ ఫించ్‌తో పడిక్కల్ ఓపెనింగ్ పంచుకోవడం నిజంగా గొప్పగా అనిపిస్తోంది. పడిక్కల్ ఆటకు హేడెన్ ఆటకు చాలా దగ్గర లక్షణాలున్నాయి. సైజ్ పరంగా హేడెన్ భారీకాయుడు. హేడెన్ చెస్ట్ చాలా పెద్దది. ఇందులో పడిక్కల్‌కు పోలిక లేదు(నవ్వుతూ). బ్యాటింగ్ టెక్నిక్ పరంగా హేడెన్‌కు పడిక్కల్‌కు చాలా దగ్గర పోలికలున్నాయి. (రోహిత్ శర్మ ఔట్..)
పడిక్కల్‌ను చూస్తే అతనిలో ఏదో ఉంది అనిపిస్తోంది’ అని మోరిస్ తెలిపాడు. ఇక తమ పేసర్లు నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్‌లపై మోరిస్ ప్రశంసలు కురిపించాడు. యువ పేసర్లు తమ జట్టులో ఉండటమే కాకుండా వారికి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టుకు విజయాల్ని అందిస్తున్నారన్నాడు. గతంలో సైనీ ఢిల్లీ జట్టులో ఉన్నప్పుడు తాను కూడా అదే ఫ్రాంచైజీలో ఉన్నానన్నాడు. అప్పుడే అతనొక మంచి బౌలర్ అనే విషయాన్ని గ్రహించానన్నాడు. ఆ టాల్ బౌలర్ బౌలింగ్ రాకెట్లు దూసుకుపోతున్నట్లు ఉంటుందన్నాడు. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సిరాజ్ బౌలింగ్ అసాధారణమని మోరిస్ కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment