30న ఆసీస్‌తో సిరీస్‌కు జట్టు ఎంపిక | 30 Australia series, the team selected | Sakshi
Sakshi News home page

30న ఆసీస్‌తో సిరీస్‌కు జట్టు ఎంపిక

Published Wed, Sep 18 2013 1:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM

30 Australia series, the team selected

ముంబై: ఆస్ట్రేలియాతో అక్టోబరు, నవంబరులో జరిగే ఏడు వన్డేల సిరీస్, ఏకైక టి20 కోసం భారత క్రికెట్ జట్టును ఈనెల 30న ఎంపిక చేయనున్నారు. అక్టోబర్ 5న ముంబైలో అడుగుపెట్టనున్న ఆసీస్ మొదట 10న రాజ్‌కోట్‌లో ఏకైక టి20 ఆడుతుంది. 13 నుంచి నవంబర్ 2 వరకు వన్డే సిరీస్ జరుగుతుంది. పుణే, జైపూర్, మొహాలీ, రాంచీ, కటక్, నాగ్‌పూర్, బెంగళూరులో ఈ మ్యాచ్‌లు ఉంటాయి.
 
 ఏజీఎం తర్వాత తుది నిర్ణయం
 దక్షిణాఫ్రికా పర్యటనపై సందిగ్ధం కాస్త తొలగింది. ఈనెల 29న జరిగే బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం తర్వాత ఈ పర్యటనకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్, సీఎస్‌ఏ సీఈఓ లోర్గాట్‌ల మధ్య సోమవారం చర్చలు జరిగినా తుది నిర్ణయానికి మాత్రం రాలేకపోయారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని లోర్గాట్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement