
కేప్‌టౌన్: కోహ్లిసేన దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జనవరి 5 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. డుప్లెసిస్ కెప్టెన్‌గా 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడి జట్టుకు దూరమైన క్రిస్ మోరిస్‌కు చోటు దక్కింది. అలాగే గాయం, ఇన్ ఫెక్షన్ నుంచి కోలుకున్న డీకాక్, స్టెయిన్‌లు కూడా జట్టులో చోటు సంపాదించారు.
తాజాగా జింబాబ్వేతో నాలుగు రోజుల ప్రయోగాత్మక టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి ఊపుమీదున్న దక్షిణాఫ్రికా జనవరి 2 నుంచి శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. స్టెయిన్ కూడా గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడి ఏడాదిగా క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. జింబాంబ్వేతో ఏకైక టెస్టుకు ఎంపికైనా అతను రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. భారత్‌తో సిరీస్ కోసమే స్టెయిన్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక భారత్ జట్టు కేప్‌టౌన్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికా జట్టు: డుప్లెసిస్(కెప్టెన్), డికాక్(వికెట్ కీపర్), హషీమ్ ఆమ్లా, బవుమా, ఏబీ డివిలియర్స్, డి బ్రూన్, ఎల్గర్, కేశవ్ మహారాజ్, మర్ర్కమ్, మోర్కెల్, క్రిస్ మోరిస్, అండిలే పెహ్లుక్‌వాయో, ఫిలాండర్, రబాడ, డేల్ స్టెయిన్.
Comments
Please login to add a commentAdd a comment