కష్టాల్లో దక్షిణాఫ్రికా
హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఎదురీదుతోంది. 175 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. డు ప్లెసిస్ (15 బ్యాటింగ్), డి కాక్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 321/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 489 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (176; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.