
అబుదాబి: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఆఖరి మూడో టెస్టులో తడబడిన పాకిస్తాన్‌ను మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ (62 బ్యాటింగ్; 4 ఫోర్లు) నిలబెట్టాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
17 పరుగులకే ఓపెనర్లు హఫీజ్ (0), ఇమాముల్ హఖ్ (9)ల వికెట్లను కోల్పోయిన పాక్‌ను అజహర్... హారిస్ సొహైల్ (34; 2 ఫోర్లు), అసద్ షఫీఖ్ (26 బ్యాటింగ్)లతో కలిసి ఆదుకున్నాడు. 229/7 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగుల వద్ద ఆలౌటైంది. పాక్ ఓపెనర్ హఫీజ్ ఈ మ్యాచ్ తర్వాత టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment