కివీస్‌కు భారీ ఆధిక్యం | A huge lead for Newzealand | Sakshi
Sakshi News home page

కివీస్‌కు భారీ ఆధిక్యం

Published Sun, Nov 30 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

కివీస్‌కు భారీ ఆధిక్యం

కివీస్‌కు భారీ ఆధిక్యం

పాక్‌తో మూడో టెస్టు
 

 షార్జా: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ జట్టు పరుగుల వరద పారిస్తోంది. ఆతిథ్య జట్టు పేసర్లు, స్పిన్నర్లను కివీస్ ఆటగాళ్లు ఓ ఆటాడుకున్నారు. ఫలితంగా తమ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 130 ఓవర్లలో 8 వికెట్లకు 637 పరుగులు సాధించగా ప్రస్తుతం 286 పరుగుల ఆధిక్యంలో ఉంది.

బ్రెండన్ మెకల్లమ్ (188 బంతుల్లో 202; 21 ఫోర్లు; 11 సిక్సర్లు) ఈ ఏడాది మూడో డబుల్ సెంచరీతో చెలరేగగా కేన్ విలియమ్సన్ (244 బంతుల్లో 192; 23 ఫోర్లు; 1 సిక్స్) తృటిలో ద్విశతకాన్ని కోల్పోయాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 297 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.

రాస్ టేలర్ (114 బంతుల్లో 50; 3 ఫోర్లు; 2 సిక్సర్లు), కోరె అండర్సన్ (57 బంతుల్లో 50; 7 ఫోర్లు; 2 సిక్సర్లు), సౌతీ (61 బంతుల్లో 50; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. రాహత్ అలీకి నాలుగు వికెట్లు, యాసిర్ షాకు మూడు వికెట్లు పడ్డాయి.

 సిరీస్‌ను ఆడలేమన్న కివీస్ జట్టు
 కరాచీ: ఫిల్ హ్యూస్ మరణంతో విషాదంలో మునిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లు పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను రద్దు చేసుకోవాలని భావించారట. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రంగంలోకి దిగి క్రికెట్ న్యూజిలాండ్ బోర్డును సిరీస్ కొనసాగేలా ఒప్పించినట్టు సమాచారం.
 
 ఈ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఇప్పటివరకూ 19 సిక్సర్లు కొట్టారు. ఇది ప్రపంచరికార్డు. గత రికార్డు (17 సిక్సర్లు) ఆసీస్ పేరిట ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement