Test squad
-
రహానే, గిల్‌కు షాక్.. ఆకాశ్ చోప్రా ఫేవరెట్ జట్టులో దక్కనిచోటు
Aakash Chopra Picks Team India Test Squad For SA Tour.. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకొని జోరు మీదున్న టీమిండియా సౌతాఫ్రికా టూర్‌కు బయల్దేరనుంది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆలస్యంగా ప్రారంభం కానున్న టూర్లో ఇరుజట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సౌతాఫ్రికా పర్యనటకు వెళ్లనున్న టీమిండియా జట్టును ప్రకటించనుంది. కివీస్‌తో సిరీస్ ఆడిన టీమిండియా జట్టునే దాదాపు కొనసాగించనుంది. అయితే ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న రహానేకు మరో అవకాశం ఇస్తుందో లేదో వేచిచూడాలి. గాయంతో బాధపడుతున్న శుబ్‌మన్ గిల్ పరిస్థితిపై ఇంకా క్లారిటీ రాలేదు. చదవండి: టీమిండియా దక్షిణాఫ్రికా టూర్.. కొత్త షెడ్యూల్ ఇదే ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా టెస్టు జట్టును ఎంపికచేశాడు. 15 మందితో కూడిన జట్టులో 11 మందిని తుది జట్టుగా ఎంపికచేసి.. మిగతా నలుగురిని రిజర్వ్‌గా ఎంపికచేశాడు. జట్టు విషయానికి వస్తే.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. ఇక వన్‌డౌన్‌లో చతేశ్వర్ పుజారా.. నాలుగో స్థానంలో కోహ్లి.. ఐదో స్థానంలో రహానేకు బదులు శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపికచేశాడు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చిన చోప్రా.. ఆల్రౌండర్లుగా జడేజా, అశ్విన్‌లకు చోటు కల్పించాడు. ఇక పేసర్లుగా బుమ్రా, షమీ, సిరాజ్‌లను ఎంపిక చేశాడు. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్‌లను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ఇక ఈ జాబితాలో అజింక్యా రహానే, గిల్‌లకు చోటు దక్కలేదు. చదవండి: రహానే ఫామ్.. నేను ఆ పని చేయలేను.. ఇంకెవరు కూడా.. కోహ్లి కౌంటర్! ఆకాశ్ చోప్రా టీమిండియా టెస్టు జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ -
‘టెస్టుల్లో అతడిపై నమ్మకం ఉంచండి’
సాక్షి, ముంబై: పరిమిత ఓవర్ల క్రికెట్లో అసాధారణ బ్యాటింగ్‌తో రాణిస్తూ, అవసరమైనప్పుడు సారథ్య బాధ్యతలు వహించి టీమిండియా విజయాల్లో ఓపెనర్ రోహిత్ శర్మ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ టీమిండియా గెలవడంలో రోహిత్ శర్మ ప్రధాన పాత్ర పోషించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎదురులేని రోహిత్.. టెస్టుల్లో మాత్రం అవకాశాలు లేక నిరాశే చెందుతున్నాడు. ప్రస్తుత ఫామ్, ఇంగ్లండ్‌లో కోహ్లి సేన ఘోర ఓటమి అనంతరం వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో రోహిత్‌కు అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. కానీ సెలక్టర్లు ఆశ్చర్యకరంగా మరోసారి రోహిత్‌ను పక్కకు పెట్టేశారు. టెస్టులకు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల ఇప్పటికే సౌరవ్ గంగూలీ, హర్బజన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలో మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా కూడా చేరారు. ‘ టెస్టుల్లో విదేశీ పిచ్‌లపై ప్రస్తుతమున్న ఆటగాళ్లలో సారథి విరాట్ కోహ్లి తర్వాత ఎక్కువ పరుగులు చేసింది రోహిత శర్మనే. కానీ సెలక్టర్లు అతడిపై ఎందుకు నమ్మకం ఉంచడంలేదు. గత ఐదు టెస్టు సిరీస్‌ల నుంచి అతడిని పక్కకు పెట్టారు. ఒకటి రెండు టెస్టుల్లో రోహిత్ విఫలమవ్వచ్చు. కానీ వరుస అవకాశాలు ఇస్తేనే రోహిత్ తానేంటో నిరూపించుకుంటాడు. పరిమిత క్రికెట్లో తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. టెస్టుల్లో కూడా సెలక్టర్లు అవకాశాలు ఇవ్వాలి.’ అంటూ నిఖిల్ చోప్రా తెలిపారు. (‘రోహిత్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది’) విదేశాల్లో రోహిత్ శర్మ ప్రదర్శన చూస్తే 14 టెస్టుల్లో 58 సగటుతో 583 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా 25 టెస్టుల్లో 39.97 సగటుతో 1479 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, తొమ్మిది అర్దసెంచరీలు ఉన్నాయి. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెలక్టర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న రెగ్యులర్ ఓపెనర్లు విజయ్, ధావన్‌లను పక్కకు పెట్టి కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్, ముంబై యువ సంచలనం పృథ్వీ షాలను ఎంపిక చేసింది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో గాయాలతో ఇబ్బందులు పడిన బౌలర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్, జస్ప్రిత్ బుమ్రా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు. చదవండి: సెలక్టర్ల ఆలోచనా విధానం ఏమిటో?: భజ్జీ -
ఆసీస్ జట్టులో భారీ మార్పులు!
అడిలైడ్: వరుసగా ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో ఓటమి. దక్షిణాఫ్రికాపై తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాభవం ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులకు తావిచ్చింది. ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ చెప్పినట్లుగానే కొంతమంది కీలక ఆటగాళ్లపై వేటు పడింది. ఈ క్రమంలోనే ఆరుగురు ఆటగాళ్లకు స్థానం కల్పిస్తూ సెలకర్టు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు ఆదివారం విడుదల చేసిన 12 మందితో కూడిన ఆసీస్ క్రికెటర్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. ఇందులో క్వీన్‌లాండ్ ఓపెనర్ రెన్ షాకు అవకాశం కల్పించగా, మరో ఇద్దరు బ్యాట్స్మెన్లు పీటర్ హ్యండ్స్ కాంబ్, నిక్ మేడిన్సన్లకు చోటు దక్కింది. మరోవైపు ఫాస్ట్ బౌలర్ల జాబితాలో చాడ్ సయ్యర్స్ చోటు లభించగా, మరో బౌలర్ జాక్సన్ బర్డ్ కు తిరిగి చోటు కల్పించింది. ఇదిలా ఉండగా, వికెట్ కీపర్‌గా మాథ్యూ వేడ్ పునరాగమనానికి రంగం సిద్ధమైంది. ఇదిలా ఉండగా,దక్షిణాఫ్రికాతో జరిగిన హోబార్ట్ టెస్టులో ఆడి ఆసీస్ ఘోర ఓటమికి కారణమైన జో బర్న్స్,ఆడమ్ వోజస్, కాలమ్ ఫెర్గ్యూసన్, నేవిల్పై వేటు వేశారు. ఇలా క్రికెట్ ఆస్ట్రేలియా ఆరు మార్పులను చేయడం 1984 తరువాత ఇదే తొలిసారి. అప్పుడు వెస్టిండీస్ తో వైఫల్యం చెందిన సందర్భంలో ఆసీస్ జట్టులో ఈ స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయి. తదుపరి ఆసీస్ జట్టు ఇదే.. స్టీవ్ స్మిత్(కెప్టెన్), జాక్సన్ బర్డ్, పీటర్ హ్యాండ్ స్కాంబ్, హజల్ వుడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయన్, నిక్ మాడిన్ సన్, మ్యాట్ రెన్ షా, చద్ సయ్యర్స్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడు, డేవిడ్ వార్నర్ -
మార్పుల్లేని దక్షిణాఫ్రికా జట్టు
డర్బన్: భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. ఇటీవల పాకిస్థాన్‌తో యూఏఈలో సిరీస్ డ్రా చేసుకున్న జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా ఎంపిక చేసింది. వన్డే టీమ్‌లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాని గ్రేమ్ స్మిత్ టెస్టు జట్టుకు మాత్రం సారథిగా బరిలోకి దిగనున్నాడు. జట్టు వివరాలు: గ్రేమ్ స్మిత్ (కెప్టెన్), హాషిం ఆమ్లా, డివిలియర్స్, డుమిని, డు ప్లెసిస్, ఎల్గర్, తాహిర్, కలిస్, క్లీన్‌వెల్ట్, మోర్నీ మోర్కెల్, అల్విరో పీటర్సన్, రాబిన్ పీటర్సన్, ఫిలాండర్, స్టెయిన్, సోలెకైల్. -
విండీస్ సిరీస్‌కు 29న టెస్టు జట్టు ఎంపిక
వెస్టిండీస్‌తో వచ్చే నెల్లో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ఈ నెల 29న భారత జట్టును ప్రకటించనున్నారు. ఆస్ట్రేలియాతో ఆరో వన్డేకు ముందు రోజు సందీప్ పాటిల్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ సమావేశమై జట్టును ఎంపిక చేయనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. విండీస్,భారత్ టెస్టు వేదికలుగా కోల్‌కతా, ముంబైలను ఇప్పటికే ఎంపిక చేశారు. తొలి టెస్టు నవంబర్ 6-10, రెండో టెస్టు 14-18 మధ్య జరగనున్నాయి. ముంబైలో జరిగే రెండో మ్యాచ్‌లో చరిత్రాత్మక 200వ టెస్టు ఆడిన తర్వాత భారత బ్యాటింగ్ గ్రేట్ సచిన్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌పై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది.